Saturday, April 20, 2024

ఆసీస్ బౌలర్ల విజృంభన.. నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

T20 World Cup: BAN lost 4 wickets 32 runs against AUS

అబుదాబి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్(0) డకౌటయ్యాడు. ఆ తర్వాత సౌమ్య సర్కార్(5) కూడా పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే ముష్ఫికర్ రహీమ్(01) వెనుదిరగడంతో బంగ్లాదేశ్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టు ఆదుకునే ప్రయత్నం చేసిన మరో ఓపెనర్ మహ్మద్ నయూమ్(17) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 6ఓవర్లలో 33 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మహమ్మదుల్లా(08), ఆసీఫ్ హోసైన్(0) లు ఉన్నారు.

T20 World Cup: BAN lost 4 wickets 32 runs against AUS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News