Saturday, November 2, 2024

న్యూజిలాండ్‌పై పాక్ విజయం..

- Advertisement -
- Advertisement -

కివీస్ ఓటమి.. పాకిస్థాన్‌కు రెండో గెలుపు
రౌఫ్ మ్యాజిక్, ఆసిఫ్, మాలిక్ జోరు
షార్జా: ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాక్ ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌ను కూడా పాకిస్థాన్ ఓడించిన విషయం తెలిసిందే. ముందుగాఈ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది. ఇక బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా పాక్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ కష్టాల్లో చిక్కుకున్నట్టు కనిపించింది. కానీ చివర్లో షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీలు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆసిఫ్ అలీ 12 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 27 పరుగులు చేశాడు. ఇక మాలిక్ 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పాకిస్థాన్ మరో 8 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఐదు బౌండరీలతో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫకర్ జమాన్ (11), మహ్మద్ హఫీజ్ (11), కెప్టెన్ బాబర్ ఆజమ్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
రౌఫ్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పాకిస్థాన్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, డారిల్ మిఛెల్ శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మిఛెల్ 27 పరుగులు చేశాడు. గుప్టిల్ మూడు బౌండరీలతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విలియమ్సన్ 25, కాన్వే 27 పరుగులు చేశారు. మిగతావారు విఫలం కావడంతో కివీస్‌కు ఆశించిన స్కోరు దక్కలేదు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 4 ఓవర్లలలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ అఫ్రిది, ఇమాన్ వసీం, షాదాబ్ ఖాన్ తదితరులు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

T20 World Cup: PAK Beat Kiwis with 5 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News