Saturday, April 20, 2024

టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు చేసిన ఐసిసి

- Advertisement -
- Advertisement -

T20 World Cup shifted out of India to UAE

యుఎఇ, ఒమన్ వేదికలుగా టి20 వరల్డ్‌కప్
అక్టోబర్ 17 నుంచి మెగా టోర్నీ, నవంబర్ 14న ఫైనల్
అధికారికంగా ప్రకటించిన ఐసిసి
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లకు తరలించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టకుని వరల్డ్‌కప్‌ను మరో వేదికకు మార్చాలని నిర్ణయించినట్టు ఐసిసి వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టి20 ప్రపంచకప్ జరుగనుంది. దుబాయి, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానాల్లో ఈ మెగా టోర్నీ నిర్వహిస్తారు. టోర్నీ ప్రాథిమిక దశలో భాగంగా తొలుత అర్హత మ్యాచ్‌లు జరుగుతాయి. ఎనిమిది అర్హత జట్లు రెండు బృందాలుగా విడిపోయి మ్యాచుల్లో తలపడుతాయి. ఈ మ్యాచ్‌లు ఒమన్, యుఎఇలలో జరుగుతాయి. అందులో నాలుగు జట్లు సూపర్12కు అర్హత సాధించాయి. ఈ జట్లు నేరుగా అర్హత ఎనిమిది జట్లతో కలిసి వరల్డ్‌కప్‌లో పోటీ పడుతాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, పపువా న్యూగిని, ఒమన్ జట్లు ప్రాథమిక దశలో పోటీపడనున్నాయి.
క్రికెటర్ల భద్రత కోసమే..
ప్రపంచకప్‌లో పాల్గొనే ఆయా జట్ల క్రికెటర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్ వేదికను మార్చినట్లు ఐసిసి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ తెలిపారు. ఈ వరల్డ్‌కప్ అందుబాటులో ఉన్న విండోలో సురక్షితంగా నిర్వహించడమే లక్షంగా పెట్టుకున్నట్టు స్పష్టం ఏశారు. బహుళ జట్లతో మెరుగైన బయో బుడగ వాతావరణం సృష్టించగల దేశంలోనే ఈ మెగా టోర్నీని నిర్వహించాలని ఐసిసి పర్చువల్ భేటిలో తీర్మానించామన్నారు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత వేదికను యుఎఇ, ఒమన్‌లకు మార్చినట్టు అలార్డిస్ వివరించారు. ఇదిలావుండగా కరోనా తీవ్రత తగ్గక పోవడంతో భారత్‌లో వరల్డ్‌కప్ నిర్వహించడం సాధ్యం కాదని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఐసిసి దృష్టికి బిసిసిఐ తీసుకెళ్లింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఐసిసి టి20 వరల్డ్‌కప్‌ను యుఎఇ, ఒమన్‌లలో నిర్వహించాలని నిర్ణయించింది.

T20 World Cup shifted out of India to UAE

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News