Saturday, April 20, 2024

లేని పారిస్ బంగళాకు తాళాలా?

- Advertisement -
- Advertisement -

Taapsee Pannu responds to I-T raids

 

ఐటి దాడులపై హీరోయిన్ తాప్సీ వ్యంగ్యాస్త్రాలు
మరీ సస్తీ చేయవద్దని చురకలు

ముంబై : ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై సినీ నటి తాప్సీ పన్ను శనివారం స్పందించారు. మూడు ట్వీట్లను వెలువరిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై దాడికి దిగారు. ఇటీవలే రెండురోజుల పాటు తాప్సీ, బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్ ఇండ్లపై ఐటి దాడులు జరిగాయి. వారి ల్యాప్‌ట్యాప్‌లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తాప్సీ రూ 650 కోట్ల పన్నుల అక్రమాలకు దిగిందని ఐటి అధికారులు అభియోగాలు మోపుతున్నారు. వీటిపై తొలిసారిగా తాప్సీ పెదవి విప్పారు. 3 ట్వీట్లతో తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు ఇచ్చారు. అధికారులు తనకు పారిస్‌లో బంగ్లా ఉందటూ తాళాల కోసం వెతికారని అయితే లేని బంగళాకు తాళాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. తాను రూ 5 కోట్లు తీసుకున్నానంటే రసీదుల కోసం వెతికారని, అయితే ఇంత పెద్ద మొత్తం తాను ఎప్పుడూ ఎవరిదగ్గరి నుంచి పొందనప్పుడు రశీదు లు ఎట్లా వస్తాయని తెలిపారు.

తన నివాసంలో 2013లోనూ ఐటి సోదాలు జరిగినట్లు ఆర్థిక మంత్రి చెప్పారని , అయితే ఈ విషయం తనకు అయితే గుర్తు లేదని, మరి ఆర్థిక మంత్రికి ఏవిధంగా గుర్తుకు వచ్చిందో తెలియదని తాప్సీ వ్యాఖ్యానించారు. తరచూ సినిమా వాళ్ల ఇళ్లపై దాడులు జరుగుతూ వచ్చాయనేది వాస్తవం అయితే ఇప్పుడు పనిగట్టుకుని ఈ విషయ ప్రస్తావన ఎందుకు వచ్చిందో తనకు తెలియదని తెలిపారు. ట్విట్టర్‌లో తాప్సీ మూడు పాయింట్లతో కూడిన వివరణాత్మక సందేశం వెలువరించారు. తనకు పారిస్‌లో బంగాళ ఉందని తాళాలు దొరికాయని చెపుతున్న వారికి రాబోయే వేసవి సెలవులు గుర్తుకు వచ్చినట్లు ఉన్నాయని దాడికి దిగారు. ఏది ఏమైనా తాను వారికి ఇంతగా చవకబారును (సస్తి)ని అయ్యానా?అని వ్యాఖ్యానించారు. తాప్సీ , అనురాగ్ కశ్యప్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పలు అంశాల వారిగా విమర్శలతో సామాజిక మాధ్యమాలలో స్పందిస్తూ వస్తున్నారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో సెలెబ్రిటీల సంఘీభావంపై ప్రభుత్వ వైఖరిని ఈ నటి తప్పు పట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News