Home తాజా వార్తలు ‘అల… వైకుంఠపురములో’ నుంచి టబు ఫస్టులుక్ విడుదల

‘అల… వైకుంఠపురములో’ నుంచి టబు ఫస్టులుక్ విడుదల

Ala ... Vaikunthapuramulo'హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. టబు పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ టబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ధనవంతురాలైన ‘అలకనందాదేవి’ పాత్రలో టబు నటిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tabu First Look Release From ‘Ala … Vaikunthapuramulo’