Home Default టబు సింగిల్‌గా ఉండడానికి కారణం అతడే!

టబు సింగిల్‌గా ఉండడానికి కారణం అతడే!

Tabu

హైదరాబాద్: సినీ నటి టబు అందం, ఒడ్డుపొడువు వగైరాలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ వయస్సు మీరుతున్న పెళ్లిచేసుకోలేదు. ఆమె పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హాష్మీ. ఆమె ఒకప్పటి ప్రసిద్ధ నటి షబానా ఆజ్మీకి మేనకోడలు కూడా. మీరెందుకు పెళ్లి చేసుకోలేదని ఆమెను ఇదివరలో ఓ టివి ఛానల్ ఇంటర్వూలో ప్రశ్నించినపుడు- అందుకు కారణం బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్నే కారణమంది. తన టీనేజ్ అప్పటి నుంచే అతడు తనపై కన్నేసి వెంటపడేవాడని, ఇతరులెవరైనా ప్రేమిద్దామనుకున్నా పడనివ్వకపోయేవాడని, కొట్టే వాడని తెలిపింది. అతడి కారణంగానే తాను లైఫ్‌లో సింగిల్‌గా ఉండిపోయానని వెల్లడించింది. టబు దేవనంద్ తీసిన సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిందన్నది అందరికీ తెలిసిన విషయమే. టబు అక్క కూడా ఒకప్పుడు ప్రసిద్ధ సినీ తారే. ఆమె పేరు ఫరా నాజ్ హాష్మీ. ఆమె పహిల్వాన్  దారా సింగ్ కొడుకు విందు దారా సింగ్‌ను పెళ్లి చేసుకుని సినీ రంగం నుంచి తప్పుకుంది.