Home తాజా వార్తలు సొంత జిల్లాలకు తహసీల్దార్లు బదిలీ

సొంత జిల్లాలకు తహసీల్దార్లు బదిలీ

Telangana Government

 

హైదరాబాద్: తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 అక్టోబర్ లో ఎన్నికల ముందు వివిధ జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లంతా పూర్వ జిల్లాలకు బదిలీ చేశారు. జోన్ 5లో 166 మంది, జోన్ 6లో 212 మంది బదిలీలకు సిఎం కెసిఆర్ అనుమతి ఇచ్చారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కెటిఆర్ కు రెవెన్యూ జెఎసి ధన్యవాదాలు తెలిపింది. మొత్తం 378 మంది అధికార్లు సొంత జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు రేపటికల్లా జిల్లా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

Tahsildars transferred to their own district