Friday, April 19, 2024

పెనుగాలులతో తాజ్‌మహల్ విలవిల

- Advertisement -
- Advertisement -

Taj Mahal was hit by Thunder and Rain

 

ఆగ్రాలో ముగ్గురు దుర్మరణం

ఆగ్రా : తుపాన్ వంటి ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల వానతో తాజ్‌మహల్ దెబ్బతింది. ఈ చలువరాతి కట్టడానికి పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. చారిత్రక, పర్యాటక ప్రేమస్థలం తాజ్‌మహల్ నెలవై ఉన్న ఆగ్రాలో శుక్రవారం రాత్రి ఉన్నట్లుండి పెనుగాలులు వీచాయి. వీటి ఉధృతితో ఆగ్రాలో పలుచోట్ల బీభత్స పరిస్థితి ఏర్పడింది. పెనుగాలులతో చోటుచేసుకున్న ఘటనలతో ఆగ్రా పట్టణంలో పరిసరాల్లో కనీసం ముగ్గురు మృతి చెందారు. పలు చోట్ల జనజీవితానికి అంతరాయం ఏర్పడింది. ఎర్ర చలువరాతి తాజ్‌మహల్ స్థూపాలు దెబ్బతిన్నాయని, ప్రహారీ గోడ, ప్రధానమైన కర్ర ద్వారం కూలాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో సంభవించిన ఈదురుగాలులు తుపాన్ తీవ్రత స్థాయిలో ఉన్నాయి. గంటకు 124 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీనితో చెట్లు, గోడలు నిట్టనిలువునా కూలాయి. పలు కార్లు, ఇతర వాహనాలపై చెట్లు, భారీ స్థాయి ప్రాకారాలు కూలి పడ్డాయి. దీనితో అవి నుజ్జునుజ్జయ్యాయి. దాదాపు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల శిథిలాల నుంచి ఆరేండ్ల బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. తాజ్‌మహల్ ఆవరణలో పలు చోట్ల ఈదురుగాలులతో నష్టం జరిగిందని ఆర్కియలాజికల్ విభాగం సహాయ అధికారి అంకిత్ నాందేవ్ తెలిపారు. యమునా వైపున ఉండే కట్టడాలకు నష్టం వాటిల్లిందని వివరించారు. తాజ్‌మహల్ కట్టడం నుంచి ఓ ఎరుపు చలువరాయి కింద పడిందని , ఈ ప్రాంతంలో దాదాపు పది చెట్లు విరిగిపడ్డాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News