Home జోగులాంబ గద్వాల్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…

కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…

Take action on corporate educational institutions ...

గద్వాల అర్బన్: జిల్లాలో ప్రవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పెద్ద మొత్తంలో ఫీజులు పెంచి దోపిడి చేస్తున్నారాని,  ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఎఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేటు పాఠశాలలకు టెక్నో మరియు కాన్స్‌ప్ట్ పేర్లు పెట్టి విద్యార్దుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా పాఠశాల పేరు తర్వాత టెక్నో, కాన్సెప్ట్ అని పెట్టుకున్న పేర్లను తక్షనమే తొలగించి అధిక ఫీజులు వనూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాముడు, వినోద్, పరుశరాం, హనుమన్న, రామన్న, రంగ తదితరులు పాల్గొన్నారు.