Home తాజా వార్తలు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి

ఆదివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి

Take all steps to prevent viral fevers says harish rao

 

వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి తన్నీరు హరీశ్ రావు

మన తెలంగాణ / సిద్దిపేట: పట్టణ ప్రాంతాల్లో వైరల్ వ్యాధులు వ్యాప్తి అధికంగున్న ప్రాంతాలపై ప్రత్యే క దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మం త్రి తన్నీరు హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీలలో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రజా భాగస్వామ్యంతో మున్సిపాలిటీలలోని అన్ని వార్డులలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ జరపాలి. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్‌లు, కమిషనర్‌లు, అధికారులు, పారిశుద్ధ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జిల్లా ఉన్నతాధికారులు, ప్రత్యేక డ్రైవ్‌లో భాగస్వామ్యమై వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు.

సోమవారం నుంచి అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్‌గా డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాం తాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని మున్సిపాలిటీలోలలో క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యాంటీలార్వా ఆపరేషన్‌లు చేపట్టి దోమల వృద్ధిని నియంత్రించాలి. దోమల నివారణ లార్వా వృద్ధిని అరికట్టేందుకు పట్టణాలలోని అన్ని చెరువులు కుంటల్లో విస్తృతంగా అయిల్ బాల్స్‌ను వేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మెదక్ ఎంపి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, కమిషనర్‌లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Take all steps to prevent viral fevers says harish rao