Tuesday, April 23, 2024

యాంటీబాడీలు తగ్గిపోతాయ్.. బూస్టర్ డోసు త్వరగా తీసుకోండి

- Advertisement -
- Advertisement -

Take Booster Dose Soon: Dr NK Arora

కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ ఎన్‌కే అరోరా సూచన

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న దృష్టా ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరునుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు ( బూస్టర్ డోసు ) తీసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా సూచించారు. వివిధ రకాల వైరస్‌లతోపాటు కొవిడ్ 19 కూడా వ్యాప్తిలో ఉంది. అయితే అదృష్టవశాత్తు తీవ్ర ప్రభావాన్ని చూపించక పోవడంతోపాటు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ మనచుట్టూ కరోనా వ్యాప్తి కొనసాగుతోందన్న విషయాన్ని మరిచిపోవద్దని అరోరా పేర్కొన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90 శాతం మంది బూస్టర్ తీసుకోని వారేనని అరోరా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News