Home తాజా వార్తలు ఎండాకాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులతో జాగ్రత్త

ఎండాకాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులతో జాగ్రత్త

Electronic Goodsసిద్దిపేట టౌన్ : బిజీ  జీవితంలో మనం ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆధారపడుతున్నాం. ఈ నేపథ్యంలో వాటి వినియోగానికి మూలమైన విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వేసవిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులతో అవాంతరాలు తలెత్తుతుంటాయి. ఫలితంగా ఎన్నో వేలు వెచ్చించి సమకూర్చుకున్న విద్యుత్ ఆధారిత పరికరాలు పాడైపోయే ప్రమాదముంది. ఈ క్రమంలో వాటి మరమ్మత్తులకు మళ్లీ రూ. వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. దైనందిన జీవితంలో అత్యధికులు వినియోగిస్తున్న ఎయిర్ కండీషన్(ఏసీ) కూలర్స్, ఫ్రిజ్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లు, కంప్యూటర్లతో పాటు, అత్యధిక ప్రజలు నేడు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు పని చేయడానికి విద్యుత్ ఆధారం. అధికంగా ఈ వస్తువులను వేసవిలో వినియోగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చెడిపోయే వీలుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కింది మెలకువలను పాటిస్తే వేసవిలో విద్యుత్ పరికరాలను కాపాడుకోవచ్చు.

ఎయిర్ కండిషన్(ఏసీ) …
ఇటీవల కాలంలో ప్రతి ఇంట ఏసీని వినియోగించడం పరిపాటిగా మారింది. మారిన కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలను అధికంగా వినియోగిస్తున్నారు. నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోకుంటే ఏసీలు సరిగా పనిచేయవు. విద్యుత్ సరఫరాలో నాణ్యత లేకుంటే కంప్రెషర్‌పై భారం పడుతుంది. ఏసీని అమర్చిన వారు విద్యుత్ స్తంభం నుంచి ఇంటికి విద్యుత్‌ను సరఫరా చేసే విద్యుత్ వరు మన్నికగా ఉండాలి. 220 వాట్స్ ఓల్టెజ్ మాత్రమే ఉండాలి. ఏసీని అమర్చిన గదిలో 25 నుంచి 30 డిగ్రీలతో కూడిన ఏసీని వాడడం వల్లే తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. కొందరు ఎక్కువ చల్లదనం కోసం 16 నుంచి 19 డిగ్రీల వరకు వాడుతుంటారు. దీని వల్ల విద్యుత్ అధికంగా ఖర్చు అయి కంప్రెషర్ పాడయ్యే అవకాశం ఉంది. కంప్రెషర్ పాడైతే రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు నష్టం వాటిల్లుతుంది. ఏసీలోని అంతర్గత పరికరాలు పదిలంగా పది కాలాల పాటు ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించాల్సిందే. అదేవిధంగా క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలి.

కూలర్ ….
దిగువ, మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా కూలర్లను వేసవిలో వినియోగిస్తుంటారు. అందరికి అందుబాటులో ఉండే విధంగా చౌక ధరలకు మార్కెట్‌లలో ఇవి లభిస్తుండడంతో ప్రతి ఇంట కూలర్లు దర్శనమిస్తుంటాయి. వీటి వినియోగంలో ప్రజలు మరింత అవగాహన పెంచుకోవాలి. తక్కువ ధరకు వస్తున్నాయని, నాసిరకానికి చెందిన అసంబుల్డ్ కూలర్లను విరివిగా కొంటున్నారు. ఈ కూలర్లలో కాపర్ వైరును వినియోగించకుండా అల్యూమినయం వైరుతో మోటారులను తయారు చేయడంతో వేడికి కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. కంపెనీలకు చెందిన కూలర్లకు సమస్యలు అధికంగా తలెత్తే అవకాశాలు ఉండవు. ఆ కూలర్లలో రాగి వైరుతో తయారు చేసిన మోటార్‌లు ఉంటాయి. కూలర్లను అధికంగా వినియోగించినట్లు అయితే వేడికి మోటర్ కాలిపోతుంది. కంపెనీలకు చెందిన కూలర్‌లను మాత్రమే వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. కూలర్లలో పోసిన నీటికి ఒక్కో సమయంలో విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదముంది. చెప్పులు వేసుకొని మాత్రమే కూలర్‌ను ముట్టుకోవాలి.

సీలింగ్ ఫ్యాన్ …
ప్రతి ఇంట కన్పించే సాధారణ విద్యుత్ పరికరం సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్‌లేని గృహలు చాలా అరుదుగా ఉంటాయి. కంపెనీలకు చెందిన సీలింగ్ ఫ్యాన్‌లను కొనుగోలు చేయకుండా తక్కువ ధరకు లభించే సీలింగ్ ఫ్యాన్‌లను కొనుగోలు చేసి అమర్చడం ద్వారా వేసవిలో అవి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్‌ను తరచుగా వినియోగించడం వల్ల కండనర్సర్‌తో పాటు వైండింగ్ కాలిపోతుంది. బేరింగ్‌లు కూడా మొరాయిస్తాయి. ఫ్యాన్‌లో నుంచి శబ్దం వస్తున్నా, తరచుగా ఆగిపోతున్నా బేరింగ్‌లు అరిగాయని గుర్తించాలి. తాత్కాలిక చర్యగా ఆయిల్ వేసి నడిపించవచ్చు. టేబుల్ ఫ్యాన్లకు ఉండే మెష్ వంగిపోకుండా జాగ్రత్త పడాలి.

కంప్యూటర్ …
ప్రస్తుత కాలంలో ప్రజలకు మరింత చేరువైన విద్యుత్ ఆధారిత పరికరం కంప్యూటర్. పిల్లల నుంచి పెద్దల దాక దీనిని వినియోగిస్తున్నారు. 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితో సిస్టమ్ మొరాయిస్తుంది. ఫలితంగా ర్యామ్ ఫాడైపోవడంతో పాటు, కంప్యూట్ హ్యాంగ్ అవుతుంది. ఓఎస్, సాఫ్ట్‌వేర్ కరప్ట్ అయ్యే ప్రమాదముంది. సీపీయూలో ఉండే పరికరాలు వేడెక్కకుండా ఉండేందుకు కంప్యూటర్లకు చల్లటి గాలి ఉండాలి.

స్మార్ట్ ఫోన్ …
ప్రతి వ్యక్తి చేతిలో కన్పిస్తున్న స్మార్ట్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువులామరింది. ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఫోన్‌ను అజాగ్రత్తగా వాడితే పాడైపోతుంది. కొందరు రాత్రి వేళలో మొబైల్‌కు చార్జింగ్ పెట్టి తెల్లవారిజామున తీస్తుండడం వల్ల బ్యాటరీ వేడెక్కి ఉబ్బుతుంది. వేసవిలో చార్జింగ్ అధికంగా పెడితే మొబైల్ వేడెక్కి పేలే అవకాశం ఉంది. మొబైల్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ద్వారా ప్రమాదాలు తలెత్తుతాయి. ఫోన్‌ను ఎండలో ఉంచితే వేడి తీవ్రతకు సున్నితమైన ఎల్రక్ట్రానిక్ సర్కూట్ కరిగే ప్రమాదముంది.

రిఫ్రిజిరేటర్ …
ఆహర పదార్థాలను నిల్వచేయడానికి, తాగు నీరు చల్లబర్చుకోవడానికి రిఫ్రిజిరేటర్‌లను అధికంగా వినియోగిస్తుంటారు. గృహాంలో కాకుండా దుకాణాలలో కూడా ఫ్రిజ్‌లను వాడుతుండడం విధితమే. వేసవిలో ఫ్రిజ్ వాడకంలో మహిళలు తగు జాగ్రత్తలు వహించాలి. ఎండ వేడిమి అధికంగా ఉంటే ఫ్రిజ్ ఆన్ కాదు. గాలి ధారాళంగా వచ్చే ప్రదేశంలో ఫ్రిజ్‌ను అమర్చాలి. కొందరూ సౌలభ్యం కోసం వంట గదిలో ఫ్రిజ్‌ను ఏర్పాటు చేస్తుంటారు. దీనివల్ల వంట గదిలో నిత్యం వేడి ఆవరించి ఉండడంతో ఫ్రిజ్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ట్రైన్ డబ్బాలో నీరు ఎప్పుడు ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఎండ వేడిమికి కంప్రేషర్ కలిపోయే అవకాశాలు ఉండడంతో గాలి వచ్చే ప్రదేశంలో ఫ్రిజ్‌ను అమర్చడం మంచిది. తప్పనిసరిగా స్టెబిలైజర్లను వినియోగించాలి. లేకుంటే లో ఓల్టెజ్ వచ్చిన తరుణంలో రిలోవయల్ ఎల్‌పీ పైపు కాలిపోయే అవకాశం ఉంది. డీప్ ఫ్రిజ్‌లో ఐస్‌ను గట్టిగా లాగకూడదు. బాక్స్‌కు రంధ్రాలు పడే అవకాశముంది.

Take Care to Electronic Goods In Summer