Saturday, April 20, 2024

వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తలసాని

- Advertisement -
- Advertisement -

 

Minister Talasani

హైదరాబాద్: బన్సీలాల్ పేటలో వలస కూలీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. రేషన్ కార్డు లేనివారికి 85 సెంటర్లలో 12 కిలోల బియ్యం, రూ.500 నగదు ఇస్తున్నామని తెలిపారు. ఎల్లుండి నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి 15 కిలోల బియ్యం, రూ.1500 నగదు ఇస్తామన్నారు. డిల్లీలోని మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన వారిలో చాలా మందికి కరోనా వచ్చింది. ప్రార్థనకు వెళ్లిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఢిల్లీలో ప్రార్థనలకు సూర్యపేట జిల్లా నుంచి 12 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 10 మందిని సూర్యపేటలోని క్యారంటైన్ కు తరలించగా.. మరో ఇద్దరిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 77కు చేరగా, మృతుల సంఖ్య 6కు చేరింది.

Talasani Distribute Essential Goods to Migrant Workers

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News