Home Default కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంది: తలసాని

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంది: తలసాని

Minister Talasani Srinivas Yadav

 

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును తర్వగా పూర్తి చేసి ప్రజల కష్టాలను దూరం చేయాలని సిఎం కెసిఆర్ ఒక ఇంజనీర్‌లా కష్టపడ్డారని, అహోరాత్రులు సమీక్షలు జరిపి ప్రాజెక్టును పూర్తిచేశాడని తెలిపారు.

రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇంత పెద్ద ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే, కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పనులు కేవలం 15 శాతం మాత్రమే పూర్తయ్యాయని భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తలసాని తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, ఎపి సిఎం జగన్‌లను ఆహ్వానించారని చెప్పారు.

Talasani speaks to media at Telangana Bhavan