Wednesday, April 17, 2024

మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం: తలసాని

- Advertisement -
- Advertisement -

Fish mobile outlets start in Hyderabad

హైదరాబాద్: రాజ్యసభలో అధికార పక్షానికి బలం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో బలంలేకున్నా మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.  రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి బిల్లులను ఆమోదింపజేసుకున్నారని, కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల్లో అగ్గిరాజుకుందన్నారు. జిఎస్ టిలో రాష్ట్రాలు నష్టపోతే పరిహారం చెల్లిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. జిఎస్ టి పరిహారం తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదని, కరోనా వైరస్ తో జిఎస్ టి లో తెలంగాణ రాష్ట్రం భారీగా నష్టపోయిందని, కేంద్రం హామీ ఇచ్చిన మేరకు పరిహారం ఇవ్వడం లేదని, అప్పులు తీసుకోవాలని రాష్ట్రాలకు ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పరిపాలన గాలికొదిలేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్నారని, కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి వ్యవసాయ మంత్రి  రాజీనామా చేశారని, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు గొప్పవైతే రాజ్యసభలో చైర్మన్ ఎందుకు లేరని ప్రశ్నించారు.

హైదరాబాద్ చుట్టూ నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 90 శాతం జిహెచ్ఎంసి పరిధిలోని పేదలకు ఇస్తామన్నారు. హైదరాబాద్ లో స్థలంలేకనే శివార్లలో ఇండ్లు కడుతున్నామని తలసాని వివరించారు. గత ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ బయటే ఇండ్లు కట్టించాయని గుర్తు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి తీరుతామని స్పష్టం చేశారు. జిహెచ్ఎంసి లో పేదల కోసం 113 ప్రదేశాల్లో ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. త్వరలోనే 28 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఇండ్లు కడుతున్నామని ప్రతిపక్షాలు అనడం అర్థం లేదన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News