Home తాజా వార్తలు ఆ ధైర్యం బిజెపి నేతలకు ఉందా?: తలసాని

ఆ ధైర్యం బిజెపి నేతలకు ఉందా?: తలసాని

huzurabad by election news,huzurabad by election who will win,huzurabad by election survey,huzurabad election news,
huzurabad by election results 2021Talasani Srinivas yadav comments on BJP

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తామని మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి తలసాని మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం బిజెపి నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. గడిచిన 7 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందని,  పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే మీరు చేసిన అభివృద్ధా? అని నిలదీశారు. ఓటమి భయంతోనే బిజెపి నేతలు ప్రభ్యత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఎంపిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తలసాని మండిపడ్డారు.

ప్రజలు డిసైడ్ చేసుకున్నారని, హుజూరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, టిఆర్ఎస్ పార్టీయే తమకు శ్రీ రామరక్ష అని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్ నియోజక వర్గంలో ఎంపి బండి సంజయ్ కరోనా సమయంలో ఎప్పుడైనా పర్యటించారా? అని అడిగారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, తాము మీ కంటే ఎక్కువే తిట్టగలమని, మాకు సంస్కారం ఉందన్నారు. ఈటెల రాజేందర్ చేశానని చెప్తున్న అభివృద్ధి మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం సహకారం తో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో చేసినవేనని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ లు ఉన్నారు.