Home తాజా వార్తలు గ్రామాలు సిరి సంపన్నం

గ్రామాలు సిరి సంపన్నం

Talasani-srinivasగ్రామాల్లో రూ. వేల కోట్ల సంపద సృష్టి
పశుసంవర్థక, మత్స, డెయిరీ రంగాలలో అంతకంతకు అభివృద్ధి
గొర్రెల పంపిణీతో సమకూరిన ఆదాయం రూ.3189 కోట్లు
13 శాతం పెరిగిన చేపల ఉత్పత్తి
ఉత్పత్తుల విక్రయాలకు విజయ డెయిరీ వినూత్న ప్రయోగాలు
సబ్సిడీపై 57,538 పాడి పశువుల పంపిణీ
దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో 3వ స్థ్దానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థ్దానం, చేపల ఉత్పత్తిలో 8వ స్థ్దానం
201-819 వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి తలసాని

హైదరాబాద్ : పశుసంవర్థక, మత్స, డెయిరీ అనుంబంధ రంగాలలో రాష్ట్రం అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. రూ. వేల కోట్ల సంపద సృష్టిస్తోంది. అది గొర్రెల పంపిణీ కావొచ్చు.. మత్సకారులకు సంక్షేమ పథకాల అమలు, ఉచిత చేప పిల్లల పంపిణీ.. పాడి రైతులకు సబ్సిడీపై పాడి పశువుల పంపిణీ కావొచ్చు… ఈ ఐదేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవత్మాక మార్పులు, అభివృద్ధిపై 2018-19కు సంబంధించిన వార్షిక నివేధికను శుక్రవారం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. కుల వృత్తిని నమ్ముకుని జీవనం చేస్తున్న ప్రతి తెలంగాణ బిడ్డను ప్రభుత్వం తరపున ఆదుకోవాలన్నదే మా లక్షం… తెలంగాణ చెరువులు నిండాలే… దాంట్లో చేపలు దుంకాలే… గ్రామాల్లో పైసలు గలగలలాడాలే… సిఎం కెసిఆర్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అధికారం చేపట్టాక పలుమార్లు చెప్పిన మాట ఇది. దీనిని అక్షరాల నిజం చేసేందుకు పలు పథకాలను తీసుకువచ్చి, అమలు చేశారని తలసాని పేర్కొన్నారు.

వేసవి పూర్తవగానే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని చెప్పారు. విజయ డెయిరీ నెయ్యి అన్ని దేవాలయాలకు సరఫరా చేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ విజయ డెయిరీ వాటర్ బాటిళ్లను వాడేలా ఆదేశాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సిఎం కెసిఆర్ వద్ద ఉందన్నారు. కేంద్ర సంయుక్త కార్యదర్శి నీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు ఆచరించేలా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ నీల్‌కుమార్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తాని యా, ఇతర ఉన్నతాధికారులు మంజువాణీ, లకా్ష్మరెడ్డి, రాంచందర్, మత్స శాఖ కమిషనర్ సువర్ణ ఉన్నారు.

వార్షిక నివేదికలో వెల్లడించిన అంశాలు..

4గొర్రెల అభివృద్ధి పథకం కు గాను 84 లక్షల గొర్రెలు ప్రక్క రాష్ట్రాల నుండి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 3.65 లక్షల మంది లబ్ది దారులకు 3.65 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. ఈ పథకం క్రింద పంపిణీ చేసిన జీవాలకు పుట్టిన గొర్రె పిల్లల (70.88 లక్షలు) ద్వారా ఇప్పటి వరకు రూ.3,189.60 కోట్ల ఆదాయము చేకూరినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఈ జీవాల ద్వారా 38,182 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. 4రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌లోని ఘనీకృత ఆబోతు వీర్య సేకరణ కేంద్రానికి రూ. 47.50 కోట్లతో లింగ క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని మంజూరు చేసింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.83 కోట్లతో పివి నరసింహరావు పశు వైద్య విశ్వ విద్యాలయం, కోరుట్ల పశు వైద్యకళాశాలలో ఇన్విట్రో ఫలదీకరణ, పిండ బదిలీ సాంకేతికత ప్రయోగశాలను మంజూరు చేసింది. 4పశుగణ రంగం 201819 సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఆదాయానికి రు.55,394 కోట్లతో రాష్ట్ర స్థూలఉత్పత్తికి 7.0% సమకూర్చింది. రాష్ట్రంలో రోజూ 12,170 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని నివేదికలో పేర్కొన్నారు. 4100 సంచార పశు వైద్య శాల ద్వారా రైతు ఇంటి ముంగిటనే పశువులకు అత్యవసరం వైద్య సేవలు అందిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. గాలి కుంటు వ్యాధి రహిత రాష్ట్రముగా దేశంలో తొలిసారి ప్రకటించారు.

దీని కారణంగా పశువుల ఉత్పత్తుల ఎగుమతి పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 4తెలంగాణ విజయ డెయిరీ రోజుకు 3.92 లక్షల లీటర్ల పాలసేకరణ, 3.20 లీటర్ల పాలవుత్పత్తుల అమ్మకాలు చేపడుతోంది. విజయ ఉత్పత్తులను ఇ వాణిజ్య పద్దతులలో బిగ్ బాస్కెట్, ఫ్లిప్ కార్ట్, సూపర్ డైలీ, దూద్ వాలా, అమెజాన్ ఆప్‌ల ద్వార వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 4గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో పశుగణ రంగం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు గోపాలమిత్రలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం వారి ప్రస్తుత జీవనోపాధి భ త్యాన్ని నెల రూ.3500 నుండి రూ. 8500ల పెంచింది.

4రాష్ట్రంలో 2.13 లక్షల పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ .1677.11 కోట్లు అంచనా ప్రాజెక్టు వ్యయంతో సహకార డైరీల ద్వారా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 201819 సంవత్సరంలో ఈ పథకం కింద 57,538 పశువులను పంపిణీ చేశారు. విజయా తెలంగాణ ప్యాక్డ్ తాగునీరును అందుబాటులోకి తీసుకువచ్చారు. 4మత్స్యకారుల సమగ్రాభివృద్ధికై రూ.1000 కోట్లతో ప్రభుత్వము సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ను చేపట్టింది. ఈ పథకం క్రింద 201819 సంవత్సరం లో 2,46,648 మత్స్యకారులు లబ్ది పొందారు.

వీరికి 55,589 మోపెడ్లు, 2640 లగేజి ఆటోలు, 502 సంచార చేపల అమ్మక వాహనాలు, 64 పరిశుభ్రచేపల రవాణా వాహనాలు, 9 ఇన్సులేటెడ్ ట్రక్కులు, 3538 లైఫ్ జాకెట్లు, 1102 పోర్టబుల్ చేపల అమ్మకం కియోస్కులు, 4898 ప్లాస్టిక్ చేపల క్రేట్లు, 75 మహిళా మత్స్యకార సంఘాలకు మార్కెటింగు సహాయం, 249 చేపఉత్పత్తుల విక్రయ కియోస్కులు, 15 ఐస్ ప్లాంట్లు, 5 చేపల దాణా మిల్లులు (చిన్నవి), 15 అలంకరణ చేపల యూని ట్లు, 3 హోల్ సేల్ చేపల మార్కెట్లు, 7 ఆక్వాటూరిజం యూనిట్లు మొదలైనవి రూ.591.08 కోట్ల వ్యయంతో మత్స్యకారులకు అందించినట్లు నివేదికలో తెలిపారు. 4వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం కింద గత ఏడాది 49.15 కోట్ల చేప పిల్లలను 10,776 జల వనరులలో 3.19 కోట్ల రొయ్య పిల్లలను 24 జలశయాలలో విడుదల చేశారు. ఫలితంగా గత సంవత్సరాలలో పోలిస్తే 13% ఉత్పత్తి పెరిగింది.

4రాష్ట్రంలో పశువులు, గొర్రెలు, కోళ్ల సంఖ్య అధికంగా ఉంది. దేశంలోని పశు సంపదలో తెలంగాణ వాటా 6.51 శాతంగా ఉన్నట్లు 201819 వార్షిక నివేదికలో పేర్కొన్నారు. దేశ గణాoకాలతో పోలిస్తే, తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తి లో 3 వ స్దానం, మాంసం ఉత్పత్తిలో 5 వ స్ధానం, చేపల ఉత్పత్తిలో 8వ స్ధానం,పాల ఉత్పత్తిలో 13వ స్ధానంలో ఉంది. పాల ఉత్పత్తిలో 22 లక్షల మంది చిన్న ఉత్పత్తిదారులు ఒకటి లేదా రెండు ఆవులు లేదా గేదెలను కలిగి ఉన్నారు. పశువుల జనాభాలో సగానికి పైగా గేదె జనాభాలో 25% రాష్ట్రంలో 30% పంట భూములను పండించడానికి ఉపయోగిస్తారు.

Talasani srinivas Yadav released Annual Report