Home తాజా వార్తలు జూలై15 నుంచి గోల్కొండ బోనాలు…

జూలై15 నుంచి గోల్కొండ బోనాలు…

tasani-srinivas-yadav

హైదరాబాద్ : గోల్కొండ బోనాలు నిర్వహణపై సచివాలయంలో కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జూలై 15వ తారీఖు నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అటంకాలు కలగకుండా అన్ని వసతి సౌకర్యాలు తీసుకుంటామని తెలియాజేశారు. బోనాల పండగ ఏర్పాట్లుపై జూన్ 30న గోల్కొండలో అధికారులతో చర్చలు జరుపునున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు.