Home తాజా వార్తలు తలసాని వ్యాపారులను వేధించేవాడు : శశిథర్‌రెడ్డి

తలసాని వ్యాపారులను వేధించేవాడు : శశిథర్‌రెడ్డి

M-ShashiDharహైదరాబాద్: వాణిజ్య పన్నులశాఖ బాధ్యతల నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తొలగించి మంచి పనిచేశారని కాంగ్రెస్ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారులు, అధికారులను తలసాని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని వ్యాపారస్థుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తలసాని హైదరాబాద్‌కు కాకుండా రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించాలని సూచించారు.