మనతెలంగాణ/హైదరాబాద్: భారతదేశంలో యువకుల యొక్క వృత్తి నైపుణ్యాలను పెంపొందించే ప్రముఖ సంస్థ టాలెంట్ స్ప్రింట్. విద్యారంగంలో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించే దిశగా డిజిటల్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు టాలెంట్ స్ప్రింట్ ప్రకటించింది. ఈ మిషన్ ద్వారా పది లక్షలకుపైగా యువత కేరీర్‌కు సంబంధించిన కలలను సాకారం చేయదలచుకుంది, గ్రామీణ ప్రాంతాలు , చిన్న పట్టణాలకు చెందిన యువతకు లింగ వివక్షత, భౌగోళిక,ఆధిక్యతలకు సంబంధించిన వివిధ సాంప్రదాయ అడ్డంకులను తొలగిస్తూ, పై సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన, మరియు సులభమైన ప్రొగ్రావ్ును ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుండైనా నేర్చుకునే విధంగా టాలెంట్ స్ప్రింట్ రూపొందించింది. కె. శ్రీధర్, ఛీఫ్ డిజిటల్ ఆఫీసర్, టాలెంట్ స్ప్రింట్, మాట్లాడుతూ “సమర్ధవంతమైన ఉపాధ్యాయులను నిలకడగా తయారు చేయడం అనేది విభిన్నకోణాలకు సంబంధించిన ఒక సమస్య. ప్రొఫెషనల్ శిక్షణ ద్వారా 100,000 పైగా ఔత్సాహిక టీచర్లుకు విజయాన్ని అందించి పైకి తీసుకురావాలన్నదే మా సంస్థ లక్ష్యం. పూర్తిగా డిజిటల్‌గా మారడం ద్వారా డిజిటల్ ఇండియా అనే పిలుపుకు అన్వయించుకోవడం జరుగుతుంది.” అని అన్నారు.