Home అంతర్జాతీయ వార్తలు విదేశీ సైనికులు వెళ్లిపోతేనే శాంతి

విదేశీ సైనికులు వెళ్లిపోతేనే శాంతి

అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా మన్సూర్
TALEBUNకాబుల్: ప్రభుత్వంతో తాము శాంతి చర్చలకు సిద్ధ మేనని అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా మన్సూర్ సంకేతా లిచ్చారు. అయితే, ముందుగా విదేశీ సైనిక బలగాలన్నిం టినీ వెనక్కి పంపించాలని, అమెరికాతో కుదుర్చుకున్న భద్రతా ఒప్పందాన్ని రద్దు చేయాలని షరతు విధించారు. బక్రీద్‌కు ముందుగా విడుదల చేసిన సందేశంలో ఆయన తాలిబన్ గ్రూపులన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ‘దేశంలో విదేశీ పాలన లేకుండా పోతే అఫ్ఘాన్ ప్రజల సమస్యలు పరస్పర అవగాహన ద్వారా పరిష్కారం అయిపోతాయి’ అని ముల్లా మన్సూర్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘కాబుల్ ప్రభుత్వం యుద్ధాన్ని అంతం చేయాలనుకుంటే, శాంతిని నెలకొల్పానుకుంటే, అది విదేశీ సైన్యాలన్నింటినీ వెనక్కి పంపించినప్పుడే, దురాక్రమణదారులతో చేసుకున్న రక్షణ, సైనిక ఒప్పందాలన్నింటినీ రద్దు చేసినప్పుడే సాధ్యం’ అని తాలిబన్ చీఫ్ అన్నారు. ఇది తాలిబన్ కొత్త నేతగా ముల్లా మన్సూర్ చేసిన తొలి ప్రకటన. 2014లో అఫ్ఘాన్ ప్రభుత్వానికీ, అమెరికాకూ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా అఫ్ఘానిస్తాన్‌లో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 13 వేల విదేశీ సైన్యాలు దేశంలో ఉంటాయి. ఇందులో ఎక్కువ అమెరికా సైన్యమే. అమెరికా తాలిబన్ల మధ్య అవిశ్వాసం, గొడవలు సృష్టిస్తోందని కూడా ముల్లా మన్సూర్ ఆరోపించా రు. తాలిబన్ సమైక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ముల్లా తన సందే శంలో చెప్పారు. జులైలో తాలిబన్ మాజీ నేత ముల్లా ఒమర్ చనిపోయాడనే వార్తలు వెలువడ్డ తర్వాత ప్రభుత్వా నికీ, తాలిబన్‌కూ మధ్య కొనసాగు తున్న శాంతి చర్చల ప్రక్రియ నిలిచి పోయింది. 2013లోనే ముల్లా ఒమర్ చనిపోయాడు. అయితే, ఈ సంవత్సరంలోనే ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ముల్లా ఒమర్ తర్వాత ముల్లా మన్సూర్‌ను తాలిబాన్ చీఫ్‌గా ఎన్నికైనప్పటి నుంచి సంస్థలో అంతఃకలహాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి.
15 మంది జవాన్లు మృతి  …
అప్ఘనిస్తాన్‌లో వేర్వేరు చోట్ల జరిగిన దాడుల్లో మంగళవారం సుమారు 15 మంది అప్ఘాన్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడులకు పాల్పడిం ది తామేనంటూ ఉగ్రవాద సంస్థ కూడా ఇంత వరకు ప్రకటించలేదని అధి కారులు పేర్కొన్నారు. కాగా, ఒక తనిఖీ కేంద్రం వద్ద జరిగిన అంతర్గత దాడిలో పది మంది జవాన్లు మృతి చెందారు. కొన్నే ళ్లుగా ఈ అంతర్గత దాడులు తీవ్ర సమస్యలను తెచ్చిపె డుతున్నాయి. ఒక జవాన్‌గానీ, ఒక పోలీసుగానీ తన తుపాకీతో ఇతర సిబ్బందిని కాల్చి వేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరి గిన అంతర్గత దాడి ఘటనపై ఉత్తర జాజ్వాన్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రొవిన్షియల్ పోలీసు చీఫ్ అబ్దుల్ హఫీజ్ ఖాషి స్పందిస్తూ ఒక దేశ ద్రోహి క్యుష్ తేపా జిల్లాలోని ఒక తనిఖీ కేంద్రలోకి ప్రవేశించి జవాన్లపై దాడిచేసి పది మందిని హతమార్చినట్లు చెప్పారు. దాడి జరిపిన వ్యక్తిని మహమ్మద్ ఆలిమ్‌గా గుర్తించామని, అతను ఆ ప్రాంతం లోని తీవ్రవాదులతో సంబంధాలున్నట్లు స్పష్టమైందని చెప్పారు. ఉత్తర బాల్క ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు పోలీసులు మరణించారు. వారిలో ఒక జిల్లా ఎస్‌పి కూడా ఉన్నారని బాల్క ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి షేర్ జాన్ దురాని వెల్లడించారు. వీరందరూ దవ్లాత్ అబద్ జిల్లాలో వాహనంలో గస్తీ తిరుగుతుం డగా బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.