Tuesday, December 3, 2024

పంజ్‌షిర్ వైపు తాలిబన్లు: లొంగుబాటుకు నాలుగు గంటలు గడువు

- Advertisement -
- Advertisement -

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చినా ఆ ప్రాంతాన్ని తాలిబన్లు ఇప్పటికీ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. తాలిబన్లకు గత రెండున్నర దశాబ్దాలుగా మింగుడుపడని ప్రాంతం ఏదైనా ఉందా అంటే దాని పేరు పంజ్‌షిర్. దేశ సైన్యమంతా లొంగిపోయి, అధ్యక్షుడు పారిపోయినా ఈ ప్రాంతంలోని వాళ్లు మాత్రం తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా ఇక్కడి వారితో చేయి కలిపి తాలిబన్లపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ప్రాంతంపై ఇప్పుడు తాలిబన్లు దాడికి సిద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలోని తిరుగుబాటుదారులు లొంగిపోవాల్సిందిగా నాలుగు గంటల సమయం ఇచ్చారు తాలిబన్లు. ఈ విషయాన్ని పంజ్‌షిర్ ప్రావిన్స్ ట్విటర్ హ్యాండిల్ వెల్లడించింది. అయితే తాలిబన్ల బెదిరింపులకు భయపడేది లేదని, ఎంత మంది వచ్చి దాడి చేసిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ తిరుగుబాటుదారుడు చేసిన ప్రకటన వీడియోను కూడా ఈ పంజ్‌షిర్ ప్రావిన్స్ షేర్ చేసింది.

Taliban moves to Panjshir Province for takeover

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News