Home తాజా వార్తలు పెద్దగా పేరు రావడం లేదు!

పెద్దగా పేరు రావడం లేదు!

Tamanna (2)తమన్నా కెరీర్ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుంది. ఆమెకు హిట్లు లేవని కాదు కానీ ఆ హిట్ల తాలూకు క్రెడిట్ కొంచెం కూడా ఆమెకు దక్కట్లేదు. తాజాగా బాహుబలి సినిమానే తీసుకుంటే ప్రశంసలన్నీ రాజమౌళి అండ్ కంపెనీకి వెళ్తుంటే విమర్శలన్నీ తమన్నా ఖాతాలోకి చేరిపోయాయి. ఆమె క్యారెక్టర్ వేస్ట్ అని, రౌద్రం చూపించలేకపోయిందని.. ఇంకా ఏవేవో విమర్శలొస్తున్నాయి. తమిళంలో కూడా తమన్నా కెరీర్ ఏమంత గొప్పగా లేదు. గత ఏడాది ఆమె నటించిన వీరం సినిమా హిట్టయ్యింది. అందులోనూ ఆమె క్యారెక్టర్‌కు పెద్దగా పేరు రాలేదు. అయితే కోలీవుడ్‌లో కొంచెం గ్యాప్ తీసుకొని ఆర్య సరసన ఆమె చేసిన ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోనూ తమన్నా రోల్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండదట.