Home తాజా వార్తలు ఒటిటిలో విడుదల కానున్న ధనుశ్ సినిమా

ఒటిటిలో విడుదల కానున్న ధనుశ్ సినిమా

Tamil Hero Dhanush Movie Release on OTTచెన్నయ్ : ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న ద్విభాషా సినిమా ’జగమే తంత్రం‘. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధనుశ్ కు జోడీగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మి నటిస్తున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఒటిటిలో విడుదల చేయాలని నిర్మాత శశికాంత్ అనుకున్నారని, దీనికి ధనుశ్ కూడా అంగీకరించారని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ధనుశ్ కు ఇది 40వ సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాలో ధనుశ్ లుక్ విభిన్నంగా ఉంటుందని  కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాను ఒటిటిలో విడుదల చేసే అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది.