2011 లో రిలీజయిన జర్నీ మూవీ గుర్తుంది కదా. ఆ మూవీలో నటించిన జంట గుర్తుంది కదా. అంజలి, జై… సూపర్ జంట అంటూ అప్పుడు మెచ్చుుకున్నాం కదా. తర్వాత కూడా వాళ్ల రిలేషన్ షిప్ ను అలాగే కొనసాగించారంటూ ఆ మధ్య రూమర్లు కూడా వచ్చాయి.
అయితే.. రూమర్లను జంట తీవ్రంగా ఖండించిన విషయం కూడా తెలిసిందే. ఇక, వీళ్ల మధ్య ఏదో ఉందంటూ… ఇప్పటి వరకు తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే.. ఆ గాసిప్స్ నిజమే అని రీసెంట్ గా దోశ చాలెంజ్ తో తేలిపోయింది.
దోశ చాలేంజా.. అదెక్కడి నుంచి వచ్చిందనేగా మీ డౌట్. అయితే.. ఇప్పుడు మనం తమిళ్ రియన్ లైఫ్ జంట.. సూర్య, జ్యోతిక గురించి మాట్లాడుకోవాలి. జ్యోతిక పెళ్లి తర్వాత దాదాపుగా సినీ రంగానికి దూరమైంది.
అయితే.. పిల్లలు పెద్దవాళ్లు అవడం, ఇక ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టంలేక.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది జ్యోతిక. ఆమె నటించిన తమిళ్ మూవీ మగలిర్ ముట్టుమ్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.
దోశ చాలేంజ్ గురించి తెలియాలంటే మీరు ఈ టీజర్ చూడాలి ఫస్ట్…తర్వాత జై, అంజలి…. సూర్య, జ్యోతిక ల విషయానికొద్దాం…
చూశారుగా.. ఇప్పుడర్థమయిందా….దోశల టాపిక్ తోనే నడుస్తుంది కదా ఆ టీజర్. ఆ.. మీకిష్టమైన వాళ్లకు ఎప్పుడైనా దోశె వేశారా అని ఆ టీజర్ లో ఉండటంతో.. సూర్య వెంటనే తన భార్య.. జ్యోతికకు మాంచి దోశ వేసి… దోశ చాలెంజ్ ను ట్విట్టర్ ద్వారా విసిరాడు. ఇక, దోశ చాలెంజ్ కు జై స్పందించాడు.
ఆయన కూడా ఓ మాంచి దోశ వేసి తన ప్రియురాలు అంజలి కి తినిపించాడట. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా .. ఫోటో తో సహా పంచుకున్నాడు జై. అంతే కాదు… జై వేసిన దోశ సూపర్ అంటూ… అంజలి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వీళ్లిద్దరి బాగోతం బట్టబయలయింది. అక్కడ దొరికేశారు దొంగలు…