Home జాతీయ వార్తలు వ్యవసాయ శాఖ మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం

వ్యవసాయ శాఖ మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం

Tamil Nadu Minister Doraikkannu Health Condition Criticalచెన్నయ్ : తమిళనాడు వ్యవసాయ  శాఖ మంత్రి దురైకన్ను(72) ఆరోగ్యం విషమంగా ఉంది. చెన్నయ్ లోని  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈనెల 13న ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే  దురైకన్నును  విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్థారించారు. పల్స్ రేటు తగ్గడంతో దురైకన్నును చెన్నయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా మారింది.  సిఎం పళనిస్వామి, మంత్రులు జయకుమార్, విజయభాస్కర్, తంగమణి, వేలుమణి,  షణ్ముగం  ఆస్పత్రికి వెళ్లి దురైకన్నును పరామర్శించారు. దురైకన్నుకు వైద్యం అందిస్తున్న వైద్యులతో సిఎం పళనిస్వామి మాట్లాడారు. దురైకన్ను పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నామని వైద్యులు సిఎం పళనిస్వామికి వివరించారు. దురైకన్ను త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, అన్నాడిఎంకె కార్యకర్తలు, నేతలు ఆకాంక్షించారు.