Friday, April 26, 2024

తమిళ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ టీవీ నటుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Tamil TV Actor Indra Kumar committed Suicide

తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు ఇంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన ఇంద్రకుమార్ అక్కడే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తమిళ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇంద్రకుమార్ మృతిపై పలువురు నటీనటులు, అభిమానులు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటుడి ఆత్మహత్యకు గల కరణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tamil TV Actor Indra Kumar committed Suicide
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News