Home తాజా వార్తలు స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు కవిత ప్రోత్సాహం

స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు కవిత ప్రోత్సాహం

Tamilisai, Kavitha

 

ఆమె నాయకత్వంలో మరింత ప్రగతి
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై, ఉమ్మడి రాష్ట్రంలో 8,968గా ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ సంఖ్య తెలంగాణలో 22,224కు పెరిగింది : మాజీ ఎంపి కవిత

నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రభుత్వం సహకారం అందించింది : కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు వెళుతుందని, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని దోమలగూడలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కల్వకుంట్ల కవి త హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ తన బాల్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో నేర్చుకున్న విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి సంస్థలను పూర్తి సేవాభావంతో ఉన్న వారు మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరన్నారు. కవిత ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్‌లో అందిస్తున్న సౌకర్యాలను ఆమె ప్రశంసించారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు పండ్లను కూడా అందిస్తామని కవిత ప్రకటించడం విద్యార్థులకు మరింత శక్తినిస్తుందని గవర్నర్ పేర్కొన్నా రు. ఈ కార్యక్రమానికి యూనిఫాం వేసుకుని రావడానికి కవిత ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని గవర్నర్ తెలిపా రు. మనం క్రమశిక్షణతో ఉన్నప్పుడే, విద్యార్థులకు క్రమశిక్షణ గురించి నేర్పించగలమని గవర్నర్ పేర్కొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బాల, బాలికలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ, గురువులను, సీనియర్లను, తల్లిదండ్రులను గౌరవించాలని గవర్నర్ కోరారు. విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన గవర్నర్ రాష్ట్రంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి కవిత చేస్తున్న కృషిని కొనియాడారు.

దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది: కవిత
ఈ సందర్భంగా మాజీ ఎంపి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ అసోసియేషన్ చీఫ్ కమిషనర్ కవిత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ అసోసియేషన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంఖ్య 8,968 ఉండగా, ప్రస్తుతం 22,224 కు పెరిగిందని ఆమె గుర్తుచేశారు. ఈ సంఖ్య 50 వేలకు చేరే విధం గా కృషి చేస్తామన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ మెరుగుపడటానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతగానో తొడ్పడిందన్నారు. 2015, -16 సంవత్సరంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సగటు సంఖ్యా శాతం పెరిగి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆమె గుర్తుచేశారు.

భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మైలురాళ్లు కొన్ని..
తొలుత రాష్ట్ర అసోసియేషన్ కేవలం హైదరాబాద్‌లోనే క్యాంపులను నిర్వహించేది. కవిత బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని జిల్లాల్లో క్యాంపులను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన రీజనల్ లెవల్ యూత్ ఫోరమ్ కమ్ స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రచారకర్తల వర్క్ షాప్‌లో ఎనిమిది రాష్ట్రాల అసోసియేషన్‌ల నుంచి దాదాపు 150 మంది పాల్గొన్నారు. కామారెడ్డికి చెంది న గైడ్ కర్రె వర్ష మలేషియాలోని కెమ్ టెకలీలో ప్రథమస్థానంలో నిలిచా రు. క్రీడలకు అవసరమయ్యే వస్తువులు, ల్యాబ్‌లలో కొత్త పరికరాలు, లైబ్రరీలో పుస్తకాలు, కొత్త బెంచీలు ఏర్పాటు చేసి పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరిచారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను పదో తరగతిలో 9కి పైగా జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు రక్షిత మంచి నీటిని అందించేందుకు పాఠశాలలో ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేశారు.

Tamilisai, Kavitha Attends in Indian Scouts and Guides