Thursday, April 25, 2024

విదేశీయులను క్వారంటైన్ చేశాం

- Advertisement -
- Advertisement -

Tamilisai

 

రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి
నిజాముద్దీన్‌కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం
– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి రాష్ట్రంలో అమల్లో ఉందని గవర్నర్ తమిళిసై వీడి యో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలతో పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలు శుక్రవారం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల/యూటిల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు సలహాలు తదితర సూచనలపై వారు చర్చించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు అన్ని రాష్ట్రా ల గవర్నర్లకు సూచించారు. హాస్పిటల్ మేనేజ్‌మెం ట్, క్లినికల్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, డబ్ల్యూహెచ్‌ఓ సహకారంతో అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా గవర్న ర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

కోవిడ్ 19 కోసం రాష్ట్రం రూ .457.75 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని, రాష్ట్రంలో శుక్రవారం నాటికి 152 కరోనా కేసులు నమోదయ్యాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 మరణాలు సంభవించాయని, గృహా నిర్బంధంలో భాగంగా విదేశాల నుంచి వచ్చినవారు, వారు కలిసిన 26,586 మంది వ్యక్తులను నిర్బంధంలో ఉంచామని ఆమె పేర్కొన్నారు. 19,364 మంది ఇప్పటి వరకు ఇంటి నిర్బంధాన్ని పూర్తి చేశారని, 7,222 మంది ఇప్పటికీ గృహా నిర్బంధంలో ఉన్నారన్నా రు. ఈనెల 7వ తేదీ నాటికి అందరూ ఇంటి నిర్బంధాన్ని పూర్తి చేస్తారని ఆమె తెలిపారు.

6 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
(i) గాంధీ మెడికల్ కాలేజ్ (ii) ఉస్మానియా మెడికల్ కాలేజ్ (iii) ఫీవర్ హాస్పిటల్ (iv) నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (v) సిసిఎంబి (vi) ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం, నారాయణగూడ)ల్లో 6పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 2,400 నమూనాలను పరీక్షించామని ఆమె తెలిపారు. ఆరోగ్య సౌకర్యాల విస్తరణలో భాగంగా క్లినికల్ నిర్వహణ కోసం 12,500 పడకలు (11,000 ఐసోలేషన్ పడకలు, 1,500 ఐసియూ పడకల) ను మొత్తం 31 ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిలో 1000 మందిలో 925 మందిని గుర్తించామని గవర్నర్ పేర్కొన్నారు. అందులో 435 మంది గృహ నిర్బంధంలో ఉన్నారని 365 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మొత్తం 9 మంది మృతి చెందినట్టు ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియచేశారు.

వైద్యులకు వ్యక్తిగత లేఖ
తీవ్రమైన ప్రమాదం ఎదురైన ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినందుకు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను గవర్నర్ ప్రశంసించారు. ఈ విషయంలో మన రాష్ట్రం, దేశం నుంచి కోవిడ్ -19 ను సమూలంగా నిర్మూలించడానికి వారు చేస్తున్న కృషి నిబద్ధతను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ వైద్యులకు గవర్నర్ వ్యక్తిగత లేఖ రాశారు.

రాజ్‌భవన్‌లో ఆహార పొట్లాల పంపిణీ
రాజ్‌భవన్‌లో శుక్రవారం కార్మికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Tamilisai Video Conference with President Vice President
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News