Thursday, April 18, 2024

హిందీ రుద్దుడికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

- Advertisement -
- Advertisement -

MK Stalin passes resolution against Hindi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ మంగళవారం రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తమిళనాడులో ద్విభాషా విధానం ఉంది. ఆ రెండు భాషలు తమిళం, ఇంగ్లీషు. కనుక తమిళంను భారత అధికార భాషగా గుర్తించాలి. అన్ని ప్రాంతీయ భాషలను అధికార భాషలు చేయాలి. హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీని రుద్దొద్దు(ఇంపోజ్). హిందీ వద్దనుకునే రాష్ట్రాలు ఇంగ్లీషును అమలుచేసుకునేలా అనుమతించాలి” అన్నారు. విద్య, ఉద్యోగాలలో హిందీ మాట్లాడేవారికి లేనిపోని ప్రాధాన్యతను కల్పించొద్దు. అలాంటి విధానం రాజ్యాంగానికే విరుద్ధం అని తెలిపారు. “ మా విధానం హిందీ రుద్దడాన్ని, నీట్‌ను, కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తుంది” అన్నారు. “తమిళనాడు వారసత్వం, సంస్కృతిని మూడో గ్రేడ్‌గా మార్చే ప్రయత్నం చేయొద్దు. దానిని వ్యతిరేకిస్తాం” అని స్పష్టం చేశారు. “హిందీ వాళ్లకి తల్లిపాలు ఇచ్చి, ఇతర ప్రాంతీయులకు విషపుపాలును ఇచ్చే విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. వారి విధానం దేశ ఐక్యతను దెబ్బతీసేదిగా ఉంది. అందుకే మేము ఈ తీర్మానం ఆమోదించాం” అని స్పష్టం చేశారు. కాగా తమిళనాడు అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించే సమయంలో బిజెపి ఎంఎల్‌ఏలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News