- Advertisement -
తమిళనాడు సాంప్రదాయ ఆట జలికట్టు ను సుప్రీం కోర్టు బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, సెలబ్రిటీలు, తమిళనాడు ప్రజలు చెన్నై మెరీనా బీచ్ వద్ద నిరవధిక సమ్మే చేస్తున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ… కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం తమిళనాడు లో బంద్ ప్రకటిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
గురువారం తమిళనాడు లో విద్యాసంస్థలుకు బంద్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా తరలివచ్చి… జలికట్టుకు మద్దతు ప్రకటించారు. విద్యార్థి సంఘాలకు ఐటి ఉద్యోగులు, సినిమా సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్ల మద్దతు కూడా లభించడంతో సమ్మె పోరు ఉదృతంగా కొనసాగుతున్నది.
- Advertisement -