Thursday, April 25, 2024

 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో…

- Advertisement -
- Advertisement -

Actress Tamannaah will start her own Banner?

దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆహా ఓటీటీలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్‌తో మెప్పించింది తమన్నా. ఈ క్రమంలో ఇప్పుడు ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌తో వస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్‌ను డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈద్ సందర్భంగా మే 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ వెబ్ సిరీస్‌కి తమిళ దర్శకుడు రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని అర్థమైంది. ఈ సిరీస్ కథ విషయానికొస్తే…దేశంలో ప్రసిద్ధ క్రైమ్ నవలా రచయిత అయిన తన తండ్రికి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు సంబంధం ఉందని తమన్నా అనుమానిస్తుంది. తమన్నా తన తండ్రిని ఈ మిస్టరీ మర్డర్ నుండి బయటపడేసిందా లేదా అనే నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో తమన్నా తండ్రి పాత్రలో జి.ఎం.కుమార్ నటించారు. తమిళంలో రూపొందించిన ‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌ని ఇతర భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మిల్కీ బ్యూటీకి ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News