Friday, March 31, 2023

తాండూర్ బస్టాండ్ అభివృద్ధికి రూ. 1.50 కోట్లు

- Advertisement -

bus

*రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి

=టిఎస్‌ఆర్‌టిసి ద్వారా 850 అంతర్ రాష్ట్ర సర్వీసులు
=రూ.350 కోట్లతో 1407 కొత్త బస్సుల కొనుగోలు చేశాం
=రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పల్లె వెలుగు బస్సులు

మన తెలంగాణ/తాండూరు: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థం పటిష్టం చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం తాండూరు బస్ స్ఠేషన్‌లో తాండూరు-బెంగుళూర్ అంతర్ రాష్ట్ర ఎసి బస్సు సర్వీస్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. నష్టాల్లో ఆర్టీసికి ముఖ్యమంత్రి కేసిఆర్ బడ్జెట్‌లో రూ,వెయ్యి కోట్లు కేటాయించారని అన్నారు. దీంతో రూ.350 కోట్లతో 1407 కొత్త బస్సులను కొనుగోళు చేసినట్లు తెలిపారు. టిఎస్‌ఆర్‌టిసి ద్వారా మొత్తం 850 అంతర్ రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. తాండూరు నుండి బెంగుళూర్‌కు కూడా అంతర్ రాష్ట్ర సర్వీసును ప్రారంభించామని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో రోడ్లు బాగా లేని కారణంగా కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించ లేదని, కొత్తగా 350 బస్సులను నడుపుతున్నామని, దేశంలోని కర్ణాటక, ఏపి, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మరింత పెంచుతామన్నారు. రాష్ట్రంలో రూ.66 కోట్లతో బస్టాండ్‌లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్టీసిలో ఆదాయం పెంచేందుకు బస్టాండ్‌లలో సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాండూరు బస్టాండ్‌ను రూ.కోటి 50లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. సినియా హాళ్లు, పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఆర్టీసి కార్మికుల కోసం కేసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. కష్టపడి పనిచేసే కార్మికులను గౌరవిస్తామని అన్నారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన తాండూరు ప్రాంతానికి తాండూరు-బెంగుళూరు బస్సు అవసరమని గుర్తించి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునితాసంపత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు అబ్దుల్ రావూప్, కౌన్సిలర్ అబ్దుల్ కవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News