Home వికారాబాద్ కాలుష్యపు కోరల్లో తాండూరు

కాలుష్యపు కోరల్లో తాండూరు

Polution

మన తెలంగాణ/తాండూరు: ప్రతి రోజు వేల సంఖ్యలో తాండూరు  నుంచి లారీలు వివిధ ప్రాంతాలకు రవాణా జరుగుతుండటంతో తాండూరు పట్టణం కాలుష్యపు కోరల్లో కొట్టు మిట్టాడుతుంది. కాలుష్యం విషయంలో తాండూరు రెండవ  స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రథమం స్థానంలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున కాలుష్యం వెదజల్లుతున్న తాండూరులో లారీల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. తాండూరు పట్టణ నడిబొడ్డులో లారీల పార్కింగ్ ఉండడంతో వేల లారీలు తాండూరు పట్టణంలోని వివిధ ప్రధాన రోడ్డు మార్గాలలో పార్కింగ్ చేస్తున్నారు.లారీల నుంచి వస్తున్న దుమ్ము ధూళి వల్ల వాతావరణం కలుషితమవుతుంది. ఇందు కోసం తాండూరు పట్టణంలోని లారీపార్కింగ్‌ను హైదరాబాద్ మార్గంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -ఇప్పటి వరకు స్థల సేకరణ సైతం పూర్తి చేయలేదు. దీంతో లారీలు అడ్డదిడ్డంగా పట్టణంలో పార్కింగ్ చేస్తున్నారు. దీని వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. తాండూరు డివిజన్‌లోని తాండూరు, బషీరాబాద్ మండలాలలో నాపరాయి, సిమెంట్ కర్మాగారాలు,పెద్దేముల్ మండలంలో సుద్ద గనులు ఉండడంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి లారీల ద్వారా సరుకు సరఫరా అవుతుంది. లారీలు  తాండూరు పట్టణం నుంచి రవాణా అవుతున్న కారణంగా రూ.100 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించాలని గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితం అవుతుంది. ఇప్పటికీ కనీసం టెండర్లు కూడా పూర్తి కాలేదు. రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఇంత వరకు పరిహారం అందించ లేదు.ఇప్పట్లో బైపాస్ రోడ్డు పనులుకు మోక్షం లేదు.దీంతో తాండూరు పట్టణం కా లుష్యం కోరల్లో చిక్కుతుంది.దీంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు.ఎక్కువగా కాలుష్యం వల్ల శ్వాసకోస వ్యాధితో బాధ పడు తున్నారు. ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్ర మండలి సర్వేలో రాజధాని ఢిల్లీ తరువాత తాం డూరులోనే అధికంగా కాలుష్యం ఉందని నిర్థారించారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి మహేంద ర్‌రెడ్డి స్పందించి లారీ పార్కింగ్‌ను తరలించాలని, బైపాస్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.