సాధారణంగా చిన్నపిల్లలు అనగానే ఆ…వాళ్లకేముంటాయిలే ల లు….బాల్యం కదా సరదాగా గడిపేస్తుంటారు…వారికేమీ తెలీదు అనుకుంటారు…పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా కొంతమంది చిన్నారులు వారికేం కావాలో, ఏమవ్వాలో ముందే తెలుసుకుంటారు.. ఆ దిశగా ప్రయాణిస్తుంటారు..ఆ కోవకు చెందిందే వాండ్రంగి తన్మయశ్రీ. తక్కువ బరువుతో పుట్టడం వల్ల కాస్త పనికే అలిసిపోయేది. ఈ సమస్యను అధిగమించేందుకు వ్యాయామంగా నృత్యాన్ని ఎంచుకుంది. ఆరోగ్యం కోసం మొదలుపెట్టిన కళ తనను కళాకారిణిగా తీర్చిదిద్దింది. కూచిపూడి నృత్యంలో తనదైన ముద్ర వేస్తూ కృష్ణుడి పాత్రలో లీనమై ‘తన్మయే కృష్ణుడా’ అన్నంతగా ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తుతుంది. చిన్నతనంలోనే ఉన్నతంగా రాణిస్తున్న చిన్నారి తన్మయశ్రీని అఖిల పలకరించింది…
తల్లి రాధికా శ్రీనివాస్ తన్మయశ్రీకి నృత్య గురువు. ఇంటి వాతావరణ ప్రభావం వల్ల పుట్టిన ఏడాది నుంచే నృత్యం పట్ల మక్కువ పెంచుకుంది. ఏడాది వయసు నుంచే కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించింది. ఆరోగ్య సమస్య వల్ల ఎక్కువ సేపు చేయలేకపోయేది. అయినా నిరుత్సా హపడలేదు. తల్లి ప్రోత్సా హంతో సాధన చేయడం మొదలెట్టింది. ప్రస్తుతం తొమ్మిదేళ్ల ఈ చిన్నారి యాభై వరకు స్టేజ్ షోలు ఇచ్చింది. నృత్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంటుంది. నేరేడ్మెట్లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న తన్మయి శివపార్వతి ఉపాధాయిని వద్ద సంగీతం అభ్యసిస్తోంది. కళలంటే ఇష్టం ఉండటం వల్ల టీవీలో కూడా పౌరాణికాలకు సంబంధించిన సీరియళ్లను చూస్తుంది. సినిమా పరిజ్ఞానం అంతగా లేదని చెబుతోంది. ఇప్పటి వరకు రెండు సినిమాలే చూశానని అమాయకంగా చెప్పింది.
చదువులోనూ ఫస్టే…
స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక గంట హోం వర్కుకు కేటాయిస్తుంది. మిగతా సమయం నృత్య, సంగీతాల కోసం వెచ్చిస్తుంది.
కళల వల్ల స్వీయ క్రమశిక్షణ అలవడుతుందని తన్మయశ్రీని చూస్తే తెలుస్తుంది. క్రమశిక్షణతో కూడిన అభ్యాసం తనను అన్నింట్లో ముందుండేలా చేసింది. కూచిపూడిలో ప్రారంభిక పార్ట్ 1, 2తోపాటు కర్ణాటక వోకల్లో ప్రారంభిక పార్ట్ 1 ఫస్టు క్లాసులో పాసయింది.
నృత్య ప్రదర్శనలు
ఇచ్చినవి కొన్ని…
l2017 జనవరి 15న భక్తి చానల్లో ప్రసారమైన ‘నాట్యవేదం’ కార్యక్రమంలో ‘కొలువైతివా రంగశాయి’ అనేపాటకు నృత్యం చేసింది.
l హైదరాబాదులోని ‘ సిరిమువ్వ’ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన పోటీలో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది.
l 2016 ఫిబ్రవరిన భద్రాచలంలో ‘భద్రశైల’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పోటీలో ప్రథమురాలుగా గెలుపొందింది.
l చర్లపల్లి జైలులో ఆగష్టు 15న 2015లో ‘ఒకపరి ఒకపరి’ అనే అన్నమాచార్య కీర్తనలకు నృత్యం చేసింది.
l 2015 మహానందిలో నృత్య ప్రదర్శన ఇచ్చింది.