Friday, April 19, 2024

దుబ్బాకలో దూసుకు పోతున్న కారు

- Advertisement -
- Advertisement -

Target one lakh votes in Dubbaka Harish rao

 

బతుకమ్మ, బోనాలతో టిఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతకు స్వాగతాలు
వానాకాలం ఉసిల్లలాంటివి కాంగ్రెస్, బిజెపిలు
దుబ్బాక తొలి మహిళా ఎంఎల్‌ఎ సుజాత
ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: లక్షమెజారిటీ లక్ష్యంగా దుబ్బాకలో టిఆర్‌ఎస్ కారు జోరుఅందుకుంది. టిఆర్‌ఎస్‌లో ట్రబుల్‌షూటర్‌గా పేరున్న ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు అన్నీతానై సోలిపేట సుజాత పక్షాన ఎన్నికలప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని రాజకీయ స్త్రాలుగా చేసుకుని టిఆర్‌ఎస్ విపక్షాలకు ఎక్కుపెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుసంక్షేమపథకాలను విరివిగా ప్రచారం చేస్తోంది టిఆర్‌ఎస్. తెలంగాణ ఏర్పడక ముందు దుబ్బాక వలసలకు కేంద్రంగా, కరవుపీడితప్రాంతంగాప్రజలుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనారు, రాష్ట్రంలో ఆకలిచావులు, నేతన్నల చావులను చవిచూసిన దుబ్బాక గడ్డ టిఆర్‌ఎస్ పాలనలో ఊపిరి పీల్చుకుంది. రైతుబంధు, చేనేత, బీడికార్మికుల సంక్షేమ పథకాలతోపాటు సాగునీరు, ఉచిత విద్యుత్‌తో దుబ్బాక అభివృద్దిలోకి మళ్లింది.

ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి హరీష్‌రావు దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల స్థానిక నాయకులు టిఆర్‌ఎస్‌లోకి భారిగా చేరుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దుబ్బాకలోని ఏడుమండాలాలైన దుబ్బాక, మీర్‌దొడ్డి, దౌలతాబాద్, తొగుట, చేగుంట, రాయిపోల్, నార్సింగ్, గజ్వేల్‌లో బతుకమ్మ ఆటపాటలతో సోలిపేట సుజాతకు టిఆర్‌ఎస్ శ్రేణులు స్వాగతాలు పలుకుతున్నాయి. బోనాల ఊరేగింపులతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. 2018 లో టిఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి 54.36 శాతం ఓట్లతో భారీ రికార్డు సాధించగా 16.31తో కాంగ్రెస్, 13.75 శాతం ఓట్లతో బిజెపి కుప్పకూలిపోయాయి. అయితే ప్రస్తుతం టిఆర్‌ఎస్ అంతర్గతంగా చేయించిన సర్వేలో గతంకంటే మెజారిటీ పేరుగుతుందని తేలింది. లక్షా 97 వేల ఓట్లలో లక్షమెజారిటీ సాధించే లక్షంతో టిఆర్‌ఎస్ కారు దుబ్బాకలో జోరు అందుకుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడూతూ కాంగ్రెస్, బిజెపి,టిడిపి విధానాలను ఎండగట్టారు.

కాంగ్రెస్, బిజెపికి ప్రభుత్వాల్లో కరెంట్ కట్

రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, బిజెపిటిడిపి బృందం ఏనాడైనా రైతుసంక్షేమం గురించి మాట్లాడారని హరిష్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటువేస్తే మళ్లీ దొంగ రాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ఉసురు తీస్తదని విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతుల పంపులకు మీటర్లు బిగించేందుకు రైతుబిల్లు తెచ్చిందని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు రైతుబంధు రైతుబీమా పథకాలు ప్రారంభించి రైతుసంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. ఎవరు అడ్డుకున్నా రైతులకు ఉచితవిద్యుత్ కెసిఆర్ ఇస్తారని చెప్పారు. వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్,బిజెపి వస్తుంటాయన్నారు. దేశంలో బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తున్నది సిఎం కెసిఆర్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాల్లో బీడికార్మికులకు పెన్షన్ ఇవ్వడంలేదన్నారు. చేనేత కార్మికులను ఆదుకున్న టిఆర్‌ఎస్‌ను ఎప్పుడూ నేతన్నలు మర్చిపోరన్నారు. యువతకు ఉపాధి అవకాశాలకోసం ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News