Home జోగులాంబ గద్వాల్ క్యాట్‌ఫిష్ చేపల చెరువులపై టాస్క్‌ఫోర్స్ దాడులు

క్యాట్‌ఫిష్ చేపల చెరువులపై టాస్క్‌ఫోర్స్ దాడులు

Catfish

 

క్యాట్‌ఫిష్‌ను పెంచుతున్న వ్యక్తిపై కేసు
జిల్లా ఇంచార్జీ ఎస్పీ కె. అపూర్వరావు

గద్వాల : జిల్లాలో క్యా ట్‌పిష్‌ను పెంచుతున్న చేపల చెరువులపై జిల్లా ఇంచార్జీ ఎస్పీ కె. అపూర్వరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఆదివారం దాడులు చేశారని ఇంచార్జీ ఎస్పీ తెలిపారు. ఈ సందర్భ ంగా ఇంచార్జీ ఎస్పీ మాట్లాడుతూ ధరూర్ మం డ లం ఖమ్మంపాడు గ్రామ శివారులో చెరువులో రూ. 1,23,750 విలువగల 1650 కేజీల నిషేదిత క్యాట్‌ఫిష్ చేప పిల్లలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ బృ ందం ఫిషరీస్ ఏడీ ఫిర్యాదు మేరకు పంచనామా అనంతరం కేసు నమోదు చేశారు.

శనివారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు, టాస్క్ ఫోర్స్ బృందం జిల్లా ఇంచార్జీ ఎస్పీ కె. అపూర్వరావు ఆదేశాల మేరకు ధరూర్ మండలం ఖమ్మంపాడు గ్రామ శివారులో కొనసాగుతున్న చేపల చెరువులలో క్యాట్‌ఫిష్ చేపలను పెంచుతున్నారన్న పక్క సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ బృందం ఆంధ్రప్రాంతంకు చెందిన ఏలియాస్ నిర్వహించే చెరువులో ఒక చెరువు రూ. 1,23,750 విలువ గల 1650 కేజీల నిషేదిత క్యాట్‌ఫిష్ చేప పిల్లలను గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఫిషరీస్ ఏడీ రూపేందర్‌సింగ్ పంచనామా నిర్వహించి వారి ఫిర్యాదు ద్వారా క్యాట్‌ఫిష్ నిర్వాహకుడైన ఏలియస్ పై ధరూర్ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. అనంతరం క్యాట్‌ఫిష్ చేప పిల్లలను భూమిలో గుంత తీసి పూడ్చి పెట్టడం జరిగింది.

Task force attacks on Catfish Fish Ponds