Home తాజా వార్తలు ఎయిరిండియాకు కేంద్రం టాటా

ఎయిరిండియాకు కేంద్రం టాటా

 

Tata group officially takes over air india

 

లాంఛనప్రాయంగా టాటా గ్రూప్‌కు విమానయాన సంస్థ పగ్గాలు
అంతకుముందు ప్రధాని మోడీతో భేటీ అయిన టాటా చైర్మన్
చంద్రశేఖరన్, ప్రపంచస్థాయి విమాన సంస్థగా తీర్చిదిద్దుతామని ప్రకటన
అప్పగింత ప్రక్రియ పూర్తి అయింది: డిఐపిఎఎం కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే
ప్రపంచ స్థాయి విమాన సంస్థగా తీర్చిదిద్దుతాం: టాటా చైర్మన్

సుమారు 70 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ సొంత గూటికి చేరింది. ఈ సంస్థను స్థాపించిన టాటా గ్రూప్‌నకు ఎయిర్ ఇండియాను గురువారం నాడు ప్రభుత్వం అప్పగించింది. డిఐపిఎఎం (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే సోషల్ మీడియాలో ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఎయిరిండియాను టేకోవర్ చేసే ప్రక్రియ గురువారంతో పూర్తయిందని, ప్రస్తుతం ఈ డీల్ క్లోజ్ అయిందని అన్నారు. మొత్తం వాటా టాటా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ టాలాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియాను అప్పుల ఊబిలో కూరుకుపోగా, చాలా ఏళ్లుగా విక్రయించాలని చూస్తున్నా సాధ్యం కాలేదు. ఇంతకాలం పన్ను చెల్లింపుదారుల రూ.వేలాది కోట్ల నిధులతోనే ఎయిర్ ఇండియాను నడిపిస్తూ వచ్చారు. ఆఖరికి రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ బిడ్ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ఎయిర్ ఇండియా కథ సుఖాంతం అయింది.

ముంబై : సుమారు 69 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ సొంత గూటికి చేరింది. ఈ సంస్థను స్థాపించిన టాటా గ్రూప్‌నకు ఎయిర్ ఇండియాను గురువారం నాడు ప్రభుత్వం అప్పగించింది. డిఐపిఎఎం (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే సోషల్ మీడియాలో ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఎయిరిండియాను టేకోవర్ చేసే ప్రక్రియ గురువారంతో పూర్తయిందని, ప్రస్తుతం ఈ డీల్ క్లోజ్ అయిందని అన్నారు. మొత్తం వాటా టాటా గ్రూప్‌నకు చెందిన టాలాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియాను అప్పుల ఊబిలో కూరుకుపోగా, చాలా ఏళ్లుగా విక్రయించాలని చూస్తున్నా సాధ్యం కాలేదు. ఇంతకాలం పన్ను చెల్లింపుదారుల వేలాది కోట్ల రూపాయల నిధులతోనే ఎయిర్ ఇండియాను నడిపిస్తూ వచ్చారు. ఆఖరికి రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ బిడ్ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ఎయిర్ ఇండియా కథ సుఖాంతం అయింది.

1932లో జెఆర్‌డి టాటా స్థాపించారు..
ఎయిర్ ఇండియాను 1932లో జెఆర్‌డి టాటా స్థాపించగా, ఆ సమయంలో తొలి విమాన సంస్థగా కరాచి బాంబే మధ్య విమానం నడిచేది. అప్పట్లో ఈ సంస్థ పేరు టాటా ఎయిర్‌లైన్స్. ఆ తర్వాత దీనిని 1953 జాతీయం చేయడంతో ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సంస్థ నష్టాల్లోకి వెళ్లడంతో 2000 సంవత్సరంలో 40 శాతం వాటాను విక్రయించాలని అటల్ బీహారి వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దశాబ్దాల్లో అమ్మాలనే ప్రయత్నం మూడుసార్లు విఫలమైంది. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణను వేగవంతం చేసింది.

12 వేల కోట్లు దాటిన నష్టం
2009-10 సంవత్సరంలో ఎయిర్ ఇండియా నష్టం రూ.12 వేల కోట్లకు పెరిగింది. 2005లో 111 విమానాల కొనుగోలు నిర్ణయం కూడా సంస్థ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైంది. ఈ డీల్ కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో కారణం కొత్త ఎయిర్‌లైన్ కంపెనీలు కస్టమర్ సర్వీస్ నుండి తక్కువ చార్జీల వ్యూహాన్ని అనుసరించాయి. ఈ పోటీలో ఎయిరిండియా చురుగ్గా లేదు. ఆ తర్వాత నుంచి సంస్థకు నష్టాలు పెరుగుతూ ఉన్నాయి.

2021లో 10.5 కోట్ల ప్రయాణీకులు
విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021లో మొత్తం 10.5 కోట్ల మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ ఉంది. ఇది రూ.1.20 లక్షల కోట్ల పరిశ్రమగా ఉంది. 2030 నాటికి చైనా, అమెరికాలను భారత్ అధిగమించగలదని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) అంచనా వేసింది. వచ్చే 4 ఏళ్లలో ఈ పరిశ్రమలో రూ.35 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. భారత ప్రభుత్వం 2026 నాటికి రూ.14,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధిని ఖర్చు చేయనున్నారు.

ఎయిర్ ఇండియా భవిష్యత్తు, సవాళ్లు
టాటా గ్రూప్ ముందు ఎయిర్ ఇండియాను లాభాల్లోకి తీసుకురావడంపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది. నష్టాల నుంచి లాభాల్లోకి మార్చే ప్రణాళికపై సంస్థ పని చేస్తుంది. దీని తర్వాత అప్పుల నుంచి బయటపడితే, అనంతరం ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు వెళ్లే అవకాశముంది. ఈ ఐపిఒని తీసుకురావడం ద్వారా ఈ సంస్థను మార్కెట్‌లో లిస్ట్ చేయడం సాధ్యమవుతుంది. అయితే కంపెనీ నష్టాల నుంచి కోలుకున్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. ఎందుకంటే దాని వాల్యుయేషన్ నిర్ణయించాలంటే నష్టాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద 114 విమానాలు ఉన్నాయి. ఇందులో 42 లీజుకు తీసుకోగా, 99 సొంతానికి చెందినవి. అయితే టాటా గ్రూప్ పనితీరు, అనుభవంతో ఎయిర్ ఇండియాను ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్లగలదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఎయిర్ ఇండియాతో టాటా సంస్థకు లోతైన అనుబంధం ఉంది. రతన్ టాటా స్వయంగా కూడా ఎయిరిండియాను కొనుగోలు గురించి చాలాసార్లు ప్రస్తావించారు.

నెలాఖరులో టాటా కొత్త బోర్డు
గత శుక్రవారం ఎయిర్ ఇండియా బోర్డు సమావేశం జరిగింది. ఈ భేటీలో విక్రమ్ దేవ్ దత్‌ను కొ త్త చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ బోర్డు సభ్యులుగా ఉన్నవారు రాజీనామా చే స్తారు. నెలాఖరులో టాటా తన కొత్త బోర్డుని ని యమించే అవకాశముంది. టాటా గ్రూప్ 25-30 శాతం మార్కెట్ వాటాతో విమానయాన మా ర్కెట్లో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ కానుంది.

Tata group officially takes over air india