Home తాజా వార్తలు ఐటి కంపెనీల టాలెంట్ హంట్

ఐటి కంపెనీల టాలెంట్ హంట్

Tata sons picks up 43.35% in tejas networks

 

5జి టెక్నాలజీ సేవలకు పెరిగిన డిమాండ్
చిన్న కంపెనీ ప్రతిభావంతులపై పెద్ద కంపెనీల గాలం
ఇప్పటికే తేజాస్ నెట్‌వర్క్‌ను సొంతం చేసుకున్న టిసిఎస్ 

న్యూఢిల్లీ : టెలికామ్ సేవల సంస్థలకు బ్యాకప్ మద్దతును అందించే 5జి టెక్నాలజీ సేవలకు డిమాండ్ దృష్టా దేశీయ ఐటి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీలు ప్రతిభావంతుల కోసం వేట మొదలుపెట్టాయి. కొన్ని మధ్యశ్రేణి సంస్థలు ఇప్పటికే టాలెంట్ హంట్‌ను వేగవంతం చేయ గా, చిన్న సంస్థల నుంచి ప్రతిభావంతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కంపెనీ వర్గాల ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) వంటి భారీ ఐటి కంపెనీలు కూడా ప్రతిభావంతుల కోసం చూస్తున్నాయి. చిన్న కంపెనీ నుంచి టాలెంట్ వేట ప్రారంభించాయి. టాటా సన్స్ అనుబంధ సంస్థ పానటోన్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్ ఇప్పటికే ఈ ఏడాది జూలైలో తేజాస్ నెట్‌వర్క్‌లో వాటాను సొంతం చేసుకుంది. సుమారు రూ.1,850 కోట్లకు తేజాస్ నెట్‌వర్క్‌లో 43.3 శాతం వాటాను టాటా సంస్థ కొనుగోలు చేసింది.

అలాగే ఒరాకిల్ ఇండియా కూడా ఇతర చిన్న కంపెనీల ఉద్యోగులను వేటాడే పనిలో ఉంది. ఈ సంస్థ 5జి టెక్నాలజీ సపోర్ట్ కోసం అవసరమైన నైపుణ్య కల్గిన ఉద్యోగులను నియమించుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. డేటా అనలిటిక్స్ కంపెనీ సిఇఒ మాట్లాడుతూ, పెద్ద కంపెనీలు రెట్టింపు, మూడింతలు వేతనంతో కొంతమంది ఉత్తమ ఉద్యోగులను సంప్రదిస్తున్నాయని, వారిని ఆపడం మా వల్ల కావడం లేదని అన్నారు. భారత్‌తో సహా గ్లోబల్ 5జి ప్రాజెక్టుల కోసం సిస్కో వంటి కంపెనీలు 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 2020 జనవరి నుంచి భారత్‌లో 5జి ఉద్యోగ నియామకాలు 30 శాతానికి పైగానే ఉన్నాయి.

కీలక సవాళ్లు
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ప్రకారం, 5జి నైపుణ్యం కల్గిన ప్రతిభావంతుల కొరత ఉంది. దీని కారణం ఈ టెక్నాలజీ కొత్తది కావడమే, ఈ నైపుణ్యం కల్గినవారికి డిమాండ్ ప్రస్తుతం అత్యంత ఎక్కువగా ఉంది. టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. అదేవిధంగా అమలు కూడా వేగంగా ఉంటోంది. వివిధ మార్గాల ద్వారా 5జి నిపుణుల అవసరాలను తీర్చుకుంటున్నామని హెచ్‌సిఎల్ పేర్కొంది. బయట ప్రతిభావంతుల కోసం వేట కూడా మొదలు పెట్టామని, అలాగే తమ క్లయింట్ల అవసరాల మేరకు 5జి స్పెసిఫిక్ ట్రైనింగ్ విధానాలు కూడా చేపడుతున్నామని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌డి సేవల కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్ గుంటూర్ తెలిపారు.

India 5G space booming with global