Thursday, March 28, 2024

‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్న టాటా టీ చక్ర గోల్డ్‌

- Advertisement -
- Advertisement -

టాటా టీ చక్ర గోల్డ్‌ ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను ‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్‌’ కార్యక్రమంతో వేడుక చేస్తుంది. మన కొండపల్లి బొమ్మలు ప్రచారంలో ఇది భాగం కావడంతో పాటుగా 400 సంవత్సరాలకు పైబడిన వారసత్వం, వినూత్నమైన పనితనంకు నివాళిగా ఈ కార్యక్రమం ఉంటుంది. గ్రామీణ జీవితం, జానపద కళలు, జంతువులకు ఈ కళ జీవం పోస్తుంది. తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైన ఈ కళారూపంలో చెక్కను ఉపయోగించి చేతితో బొమ్మలు తయారుచేస్తారు. మహోన్నతమైన ఈ కళారూపం అంతరించిపోయే దశలో ఉంది. ప్లాస్టిక్‌ బొమ్మలు విరివిగా లభిస్తుండటం, ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదుర్కొవడం తదితర కారణాల వల్ల ఈ కళాకారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ఈ కొండపల్లి బొమ్మలకు తగిన ప్రాచుర్యం కల్పించడంతోపాటుగా పునరుద్ధరించే లక్ష్యంతో టాటా టీ చక్ర గోల్డ్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హ్యాండిక్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ కు చెందిన లేపాక్షితో భాగస్వామం చేసుకుంది. లేపాక్షి సంస్ధ ఇప్పుడు కొండపల్లి బొమ్మలను తమ ఈ–కామ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచడంతో పాటుగా కొనుగోలు చేయాల్సిందిగా కళాభిమానులను ప్రోత్సహిస్తుంది. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి కొండపల్లి బొమ్మకు టాటా టీ చక్ర గోల్డ్‌ 100 రూపాయలను ఈ కళాకారులు, కళారూపానికి అందజేస్తుంది. దీనితో పాటుగా ఈ బ్రాండ్‌ ఇప్పుడు కొండపల్లి ఆర్ట్‌తో ప్రత్యేకంగా నవరాత్రి పండుగ ప్యాక్‌లను సైతం విడుదల చేసింది.

ఈ కార్యక్రమం గురించి పునీత్‌ దాస్‌, ప్రెసిడెంట్‌– ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌ (ఇండియా –దక్షిణాసియా), టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమం ద్వారా ఏపీ, తెలంగాణాల లో కనుమరుగవుతున్న వారసత్వంను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ క్రమంలోనే లేపాక్షితో భాగస్వామ్యం చేసుకుని కొండపల్లి కళాకారుల సాధికారితకు తోడ్పడుతున్నాము’’ అని అన్నారు. లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్‌ మీడియా కో ఆర్డినేటర్‌, కన్సల్టెంట్‌ హెడ్‌ ఆఫీస్‌ శ్రీ ఐ హెచ్‌పీ రావు మాట్లాడుతూ ‘‘టాటా టీ చక్ర గోల్డ్‌ టీతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా కనుమరుగవుతున్న కళారూపాలను పునరుద్ధరించడం, కళాకారుల సంక్షేమానికి తోడ్పడటం సాధ్యమవుతుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News