Home తాజా వార్తలు రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి

రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి

Tax

 

ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గాయి
2019-20లో మైనస్ 6.1 శాతానికి వసూళ్లు
అన్ని ప్రధాన నగరాల్లో ప్రతికూల వృద్ధి
అహ్మదాబాద్, నాగ్‌పూర్ మాత్రమే సానుకూలం

న్యూఢిల్లీ: కొద్ది రోజుల్లో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చేదువార్త. తాజా ప్రభుత్వ గణాంకాల్లో దేశీయ ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెండు దశాబ్దాల్లోనే తొలిసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 20) దేశీయ కార్పొరేట్, ఆదాయ పన్నుల వసూళ్లు ప్రతికూలంగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధిలో మందగమనం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. గతేడాది ఏఫ్రిల్ నుంచి 2020 జనవరి 15 మధ్య కలంలో పన్ను వసూళ్లు మైనస్ 6.1 శాతానికి చేరాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వచ్చిన ఈ గణాంకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రత్యక్షపన్ను వసూళ్లు దేశంలోని ప్రజలు, కార్పొరేట్ రంగం ఆదాయానికి కొలమానంగా భావిస్తారు.

ఆరోగ్యకరమైన పన్ను ఆదాయం ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించేందుకు దోహదం చేస్తుంది. గతేడాది జులై 5న బడ్జెట్ లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్షం రూ.13.35 లక్షల కోట్లుగా ప్రకటించారు. అయితే ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.73 లక్షల కోట్ల నుంచి రూ.7.26 లక్షల కోట్లకు తగ్గాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల నుంచి రూ.3.87 లక్షల కోట్లు అందుకోగా, వ్యక్తిగత ఆదా యం పన్నుల నుంచి రూ.3.29లక్షల కోట్లు, సెక్యురిటీ లావాదేవీల పన్నుల నుంచి రూ.9000 కోట్లు, ఈక్విలైజేషన్ లెవీ వసూళ్లు రూ.887 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు వసూళ్లలో ప్రతికూల వృద్ధి వివిధ జోన్లలో వృద్ధి తగ్గుదలను చూపుతోంది.

గణాంకాల ప్రకారం, అన్ని జోన్లలోనూ ప్రతికూల వసూళ్లు చూపిస్తుండగా, 2 జోన్లలో మాత్రమే సానుకూల వృద్ధి వుంది. వాటిలో అహ్మదాబాద్‌లో 0.30 శాతం వసూళ్లు వృద్ధి, నాగ్‌పూర్‌లో ఆరోగ్యకరమైన వృద్ధి 35 శాతం నమోదైంది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వసూళ్లలో ప్రతికూల వృద్ధి నమోదైంది. ముంబై -5.9 శాతం, ఢిల్లీ – 10.8 శాతం, చెన్నై 2.6 శాతం, హైదరాబాద్ – 0.1 శాతం, బెంగళూరు – 7.4 శాతం, అత్యంత ఎక్కువగా క్షీణత జైపూర్ 20.4 శాతంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Tax collection October projection of 6.1 percent