Friday, March 29, 2024

కొత్త పన్ను విధానం అందుకే..

- Advertisement -
- Advertisement -

Taxpayer Charter

 

పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం
వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని బడ్జెట్‌లో ఎందుకు చేర్చారో ఆమె వివరించారు. పాత ఆదాయపు పన్ను విధానాన్ని అమలులో ఉంచుతూ బడ్జెట్‌లో కొత్త ప్రత్యామ్నాయ పన్ను నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. అయితే పన్ను చెల్లింపుదారులు అకస్మాత్తుగా ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి కొత్త విధానం వారి ఇష్టానికే వదిలేశామని ఆమె తెలిపారు. 2020-21 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించి ఒక రోజు తర్వాత ఆదివారం మీడియాతో ప్రత్యేక చర్చలో ఆర్థికమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పన్ను నిర్మాణాన్ని సరళతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.

అయితే ఆకస్మిక మార్పు పన్ను చెల్లింపుదారులను ఒత్తిడికి గురిచేయదని, వారు కొత్త, పాత విధానాల ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. తద్వారా వారు కొత్త విధానాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పొందుతారని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్నులో ఏడు శ్లాబ్‌ల కొత్త వ్యవస్థను ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొత్త విధానంలో అనేక పన్ను రాయితీలు, మినహాయింపులను తొలగించింది. పాత పద్ధతిలో రూ.5 లక్షల వరకు, రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు, 10 లక్షల రూపాయలకు పైన ఆదాయంపై వరుసగా 5, 20, 30 శాతం చొప్పున పన్ను నిబంధన ఉంది. కొత్త విధానంలో 15 లక్షల రూపాయల వరకు వివిధ స్థాయిల ఆదాయం ఉంది. అయితే 5, 10, 15, 20, 25 శాతం, 30 శాతం చొప్పున పన్ను ప్రతిపాదించారు.

కార్పొరేట్ పన్ను సరళతరం
కార్పొరేట్ పన్నును సరళతరం చేశామని, దీనిపై ప్రశంసలు వచ్చాయని ఆర్థిక మంత్రి అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాలు రాగా, వారు కొత్త రాయితీలను చేర్చారు. మొత్తం మీద ఇప్పటివరకు 120 వరకు రాయితీలు ఆదాయపు పన్ను చట్టంలో చేర్చారు. కొత్త పన్ను చెల్లింపుదారులు వారి సౌలభ్యం ప్రకారం జాబితాలో రాయితీని కనుగొంటారు. ఈ విధానంలో పన్ను చెల్లింపుదారునికి ఎంత సామర్థ్యం ఉందో సాంకేతికంగా తెలియదని ఆమె అన్నారు. ఎవర్నీ పొదుపు చేయకుండా ఆపబోమన్నారు. ఖర్చు చేయవచ్చు, పొదుపు కూడా చేయవచ్చని అన్నారు. అయితే మొత్తం విధానాన్ని మెరుగుపరచడం గురించి ఆలోచించాలని అన్నారు. పన్ను విధానాన్ని సరళతరం చేయడానికి ఎప్పటికప్పుడు అనేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీతారామన్ తెలిపారు. ఎక్కువ కాలం రాయితీలు ఉండబోవని కూడా ఆమె తెలిపారు.

పన్ను చెల్లింపుదారుల చార్టర్
పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులు, అధికార యంత్రాంగం మధ్య నమ్మకాన్ని పెంచాలని, దీని కోసం టాక్స్ చార్టర్‌ను సిద్ధం చేయాలని సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)ని ఆదేశించామని అన్నారు. దేశంలో సంపద సృష్టించేవారిని గౌరవిస్తామని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ అన్నారు.

ఎన్‌ఆర్‌ఐలకు గ్లోబల్ టాక్స్ ఉద్దేశం లేదు
ప్రవాస భారతీయులకు(ఎన్‌ఆర్‌ఐ) గ్లోబల్ ఆదాయంపై పన్ను ఆలోచనేమీ లేదని ఆదివారంనాడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శనివారం బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐల గ్లోబల్ ఆదాయం టాక్సబులిటీపై గందరగోళం నెలకొంది. ప్రవాస భారతీయుల ఆదాయం ఇండియాలో ఉత్పన్నమవుతున్నందుకు గాన పన్ను ఉంటుందని, చట్ట పరిధిలో ఆర్జిస్తున్న గ్లోబల్ ఆదాయం ఉన్నట్లయితే పన్ను ఉండబోదని అన్నారు.

Taxpayer Charter for Taxpayers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News