Home తాజా వార్తలు ఇక జిఎస్‌టి రిటర్న్ క్లెయిమ్‌కు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి

ఇక జిఎస్‌టి రిటర్న్ క్లెయిమ్‌కు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి

Taxpayers to certify aadhaar to claim gst

 

న్యూఢిల్లీ: జిఎస్‌టి రిటర్న్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారుల ఆధార్ ప్రామాణికతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పలు పన్ను ఎగవేత నిరోధక చర్యలను కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సిబిఐసి) జిఎస్‌టి నిబంధనలను సవరించింది. జిఎస్‌టి రిజిస్ట్రేషన్‌ను దేనిపై పొందారో అదే పాన్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలకి మాత్రమే జిఎస్‌టి రిఫండ్‌లను జమ చేయడం వీటిలో ప్రధానమైనది. అంతేకాకుండా 2022 జనవరి 1నుంచి జిఎస్‌టి సమ్మరీ దాఖలు చేయని, నెలవారీ జిఎస్‌టి చెల్లించని వ్యాపార సంస్థలు తదుపరి నెలకు సంబంధించిన జిఎస్‌టిఆర్1 అమ్మకాల రిటర్న్‌ను దాఖలు చేయడానికి వీలుండదని కూడా సిబిఐసి నోటిఫికేషన్ పేర్కొంది. ఈ నెల 17న లక్నోలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల తర్వాత ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కాగా వెరిఫై చేసిన టాక్స్‌పేయర్లు మాత్రమే రిఫండ్‌లు పొందడానికి తాజా నిబంధనలు తోడ్పడతాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Taxpayers to certify aadhaar to claim gst