Tuesday, March 21, 2023

టిబిజికెఎస్ నాయకత్వంపై నీలినీడలు

- Advertisement -

trs* కార్మికుల్లో ఆసక్తి… నేతల్లో తీరని ఉత్కంఠ
* రెండున్నర నెలలు గడిచినా నాయకత్వంపై సందిగ్దత
* నాయకత్వం కోసం తప్పని ఎదురు చూపులు
* కొత్త నాయకత్వాన్ని అందిస్తామని సిఎం హామీ
* టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న కసరత్తులు

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగి రెండున్నర మాసాలు గడుస్తున్నప్పటికీ  నాయకత్వంపై  సందిగ్దత  వీడలేదు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ 11 ఏరియాలకు గాను 9 ఏరియాల్లో గెలుపు సాధించిన విషయం విదితమే. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ పదవీ కాలాన్ని రెండు సంవత్సరాలకే పరిమితం చేసి, కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని టిబిజికెఎస్ సూచించగా ఇప్పటి వరకు నాయకత్వంపై కసరత్తులు సాగుతుండగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టిబిజికెఎస్‌లో పాత కమిటీకి కా కుండా కొత్త కమిటీకి అవకాశం కల్పిస్తామని సిఎం కెసిఆర్ కార్మికులకు స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకే కొత్త నాయకత్వంపై చర్చలు జరుగుతుండగా మెజార్టీ కార్మికుల అభిప్రాయాలను సైతం సేకరించారు. గతంలో ఉన్న టిబిజికెఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏర్పడగా మళ్లీ వారు పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు టిబిజికెఎస్ గుర్తింపు సంఘానికి ఏరియా స్థాయి కార్పోరేట్ స్థాయిలో నేతృత్వం ఎవరు వహిస్తారనేది తేలడం లేదు. కార్మికుల్లో మంచి పేరు ఉన్న నాయకున్ని ఎంపిక చేసేందుకు టిఆర్‌ఎస్ నాయకత్వం కసరత్తులు చేస్తూ గనుల వారిగా సర్వేలు నిర్వహించింది. అయితే రెండున్నర నెలలు గడుస్తున్న కార్మికులు ఎదురుచూస్తున్న నాయకుడు ఎవ రు అనేది స్పష్టం కాలేదు. కేంద్ర, కార్మికశాఖ గత నెలలో సింగరేణిలో గుర్తింపు సంఘంగా టిబిజికెఎస్‌ను ప్రకటిస్తున్నట్లు యజమాన్యానికి లేఖ రాసింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఏరియా స్థాయి,  కార్పొరేట్ స్థాయిలో నాయకత్వాన్ని  కార్మిక సంఘ మే సంస్థాగతంగా ఎంపిక చేసుకునేంది. 2012లో జరిగే ఎన్నికల్లో  గెలుపొందిన టిబిజికెఎస్ కార్మికుల్లో వ్యతిరేకత, విశ్వాసాన్ని పొందలేకపోయిన విషయంలో టిఆర్‌ఎస్ బాధ్యతలను తీసుకొని, కొత్త నాయకున్ని ఎన్నిక కోసం కసరత్తులు చేస్తుంది. రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంచి నాయకత్వాన్ని ఎంపిక  చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. సిఎం కేసిఆర్ సింగరేణి బొగ్గు గనుల పర్యటన తరువాత కొత్త నాయకత్వాన్ని పర్యటిస్తారని పేర్కొనడం, ఇటీవలి కాలంలో సిఎం బిజీగా ఉండడంతో  పర్యటన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం దొరికిన కొద్దిపాటి విశ్రాంతి వలన ఈ నెలాఖరులోగా టిబిజికెఎస్ కార్యవర్గాన్ని ఎంపిక చేస్తారని కార్మికులు భావిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి చర్చలు జరిపే ఎనిమిది మంది కీలక నాయకులతో పాటు 11 ఏరియాలకు ఉపాధ్యక్షులను నియమించాల్సి ఉంటుంది. అయా ఏరియాల పరిధిలో జిఎం స్థాయి అధికారులతో చర్చలు జరిపే అధికారిక కమిటీలు గనుల స్థాయిలో ఫిట్‌కార్యదర్శులను ఎంపిక చేయాలి. కార్పొరేట్ ఏరియా స్థాయి నాయకులను ప్రభుత్వం ఎంపిక చేస్తే గనుల కమిటీలను టిబిజికెఎస్ నాయకత్వం చేపట్టే అవకాశాలు ఉంటాయి. టిఆర్‌ఎస్ అధిష్టానం ఎంపిక చేసే కమిటీల్లో  పాతవారికి అవకాశం దక్కుతుందా.. పూర్తి స్థాయిలో కొత్త  కమిటీని ఏర్పాటు చేస్తారాననేది సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News