Home బిజినెస్ రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటిన టిసిఎస్

రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటిన టిసిఎస్

TATA

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) కీలక మైలురాయిని చేరుకుంది. సంస్థ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న సంస్థ టిసిఎస్ కావడం విశేషం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో టిసిఎస్ మార్కెట్ విలువ రూ. 6,12,696.46 కోట్లుగా ఉంది.  ఇటీవల రిలయన్స్ కూడా రూ.6లక్షల కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే మార్కెట్ విలువ పరంగా రిలయన్స్‌తో పోలిస్తే టిసిఎస్ దేశంలోనే అత్యంగా విలువ గల సంస్థగా నిలిచింది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.6,11,096.56 కోట్లుగా ఉండగా, టిసిఎస్ విలువ కొంత ఎక్కువగా ఉండడంతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టిసిఎస్, రిలయన్స్ తర్వాత మూడో స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.5,08,576.16 కోట్లుగా ఉంది. అత్యంత విలువ గలిగిన కంపెనీల జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో.. ఐటిసి విలువ రూ.3,41,332.79 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.3,03,382.63 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో టిసిఎస్ షేరు విలువ 2.35 శాతం లాభపడిన రూ. 3,175 వద్ద స్థిరపడింది.