Friday, July 11, 2025

శ్రీసత్యసాయి జిల్లాలో రెచ్చిపోయిన టిడిపి నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో వైసిపి కార్యకర్త అశోక్‌పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. టిడిపి నేతలు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా అశోక్ పై దాడి చేశారు. అశోక్ చేస్తున్న కాంట్రాక్టు పనులు తమకు అప్పగించాలని టిడిపి నేతలు దాడికి పాల్పడ్డారు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. టిడిపి నేతల అధికార మదంతో తమపై దాడులకు పాల్పడుతున్నారని వైసిపి కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనం మనషులమా, క్రూర మృగాలమా? అనే అనుమానాలు అని నెటిజన్లు మండిపడుతున్నారు. బహిరంగంగా ఒక వ్యక్తిపై పది మంది కర్రలతో దాడులు చేయడం అటవీక చర్య అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News