Home తాజా వార్తలు రైతుల పేరిట టిడిపి చౌకబారు రాజకీయాలు

రైతుల పేరిట టిడిపి చౌకబారు రాజకీయాలు

Tummala

ఖమ్మం : రైతుల పేరిట తెలంగాణ టిడిపి నేత రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఏనాడూ రైతుల గురించి పట్టించుకోని టిడిపి నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కారుకూతలు కూస్తున్నారని, ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని తుమ్మల హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ పాటుపడుతుంటే , అభివృద్ధిని అడ్డుకునేందుకు టిడిపి, ఇతర ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

శనివారం ఖమ్మంలో టిడిపి రైతు పోరు దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిటిడిపి నేత రేవంత్‌రెడ్డి మంత్రి తుమ్మలపై ధ్వజమెత్తారు. రైతుల కాళ్లు కడిగినా తుమ్మల పాపాలు పోవని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తుమ్మల శనివారం మీడియాతో మాట్లాడుతూ టిడిపి నేతలపై ధ్వజమెత్తారు.