Thursday, November 7, 2024

టిడిపి నేత దేవినేని ఉమ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

TDP Leader Devineni Uma Arrested in gollapudi

అమరావతి:  కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసిపి నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన దీక్షకు యత్నించారు. దీంతో ఆందోళన చేస్తున్న ఉమను పోలీసులు అరెస్టు చేశారు. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. కొడాలి నాని స్థాయిమరిచి బూతులు తిట్టడం ఇకనైనా మానుకోవాలని టిడిపి హితువు పలికింది. ధైర్యం ఉంటే టచ్ చేయాలని మంత్రి కొడాలినానికి మాజీ మంత్రి దేవినేని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దేవినేని ఉమ దీక్షకు మద్దతుగా బయల్దేరిన పలువురు టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గొల్లపూడి ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

TDP Leader Devineni Uma Arrested in gollapudi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News