Home తాజా వార్తలు నంద్యాలలో టిడిపిదే పైచేయి..

నంద్యాలలో టిడిపిదే పైచేయి..

YSRCP-vs-TDP

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో టిడిపి భారీ మెజారిటీ దిశలో పయనిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష వైసిపికి ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మార్చుకున్నాయన్న విషయం తెలిసిందే. వైసిపి బలంగా చెప్పుకుంటున్న నంద్యాల రూరల్ లోనూ మొదటి రౌండ్ నుండి వరసగా నాలుగు రౌండ్లలో టిడిపి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నంద్యాల రూరల్ మొత్తం ఆరు రౌండ్లు ఉంటాయి. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టిడిపికి 13,145 వేల మెజారిటీ కనబరుస్తుంది.  ఇక నంద్యాల అర్భన్లో మొదటినుండి టిడిపికి పట్టుందంటున్నారు. మరి కొద్ది సేపట్లో నంద్యాల టౌన్ కు చెందిన లెక్కింపు కొనసాగనుంది. ఇప్పటివరకు టిడిపికి 31062, వైసిపికి 17927 ఓట్లు పోలయ్యాయి. కగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 278 ఓట్లు మాత్రమే పోలవ్వటం విశేషం.

TDP leading in Nadyala by poll