Home తాజా వార్తలు నంద్యాలలో టిడిపిదే విజయం : చంద్రబాబు

నంద్యాలలో టిడిపిదే విజయం : చంద్రబాబు

Chandra-babu1

కర్నూలు : నంద్యాలలో టిడిపిదే విజయమని ఆ పార్టీ చీఫ్, ఎపి సిఎం చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా శనివారం ఆయన అయ్యలూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నంద్యాల అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు కేటాయించామని ఆయన చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఇక్కడ విజయం తమదేనని, వచ్చే ఎన్నికల్లో సైతం తాము భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, వారి ప్రలోభాలకు గురి కావద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

TDP’s Victory in Nandyal : Chandrababu